పోస్టల్ బ్యాలెట్ ఓటు.. కొత్తగా మూడు విభాగాల వయస్సు వారికి
5 రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. కరోనా కోసం జాగ్రత్తలు పాటిస్తూనే ఎన్నికలను ఈసీ నిర్వహించనుంది. దీంతోపాటు వృద్దులు, వికలాంగులు, కరోనా సోకిన వారికి ప్రత్యేక సౌకర్యం కల్పించింది. పోలింగ్ బూతుల సంఖ్యను పెంచి.. కరోనా వైరస్ సంక్రమణకు బ్రేక్ చేయాలని అనుకుంది. అలాగే పోలింగ్ స్టేషన్ల వద్ద వెయిటింగ్ ఏరియా, టాయిలెట్స్, ర్యాంప్స్, ఏర్పాటు చేశారు.

మాస్క్, సానిటైజర్..
పోలింగ్
స్టేషన్లను
విధిగా
సానిటైజ్
చేయాల్సిందేనని
స్పష్టంచేశారు.
మాస్క్
తప్పనిసరిగా
ధరించాలని
సూచించారు.
మాస్క్,
సానిటైజర్..
ప్రతీ
పోలింగ్
స్టేషన్
వద్ద
అందుబాటులో
ఉంటుందని
తెలియజేశారు.
అలాగే
1620
పోలింగ్
స్టేషన్లలో
మహిళ
సిబ్బంది
కూడా
విధులు
నిర్వహిస్తారని
సీఈసీ
సుశీల్
చంద్ర
తెలిపారు.
అలాగే
కరోనా
వల్ల
80..
ఆ
పై
వయస్సు
గలవారికి
పోస్టల్
ద్వారా
ఓటు
వేసే
అవకాశం
కల్పించారు.
వీరితోపాటు
వికలాంగులు,
కరోనా
సోకిన
వారికి
కూడా
పోస్టల్
బ్యాలెట్
ద్వారా
ఓటు
వేసే
ఛాన్స్
ఇచ్చారు.

ఆంక్షలు
ఈ సారి ఎన్నికల ప్రచారం కూడా అంతా ఆన్ లైన్లో జరగనుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలపై కూడా ఆంక్షలు ఉన్నాయి. దీంతో జనంతో కలిసే అవకాశం తక్కువ అవకాశం ఉంటుంది. జనవరి 15వ తేదీ వరకు నిషేధం విధించింది. తర్వాత పరిస్థితిని బట్టి సీఈసీ తెలియజేయనుంది.

690 సీట్లు
ఐదు
రాష్ట్రాల్లోని
690
అసెంబ్లీ
సీట్లకు
ఈ
ఎన్నికలు
జరగనున్నాయి.
గోవాలోని
40,
పంజాబ్
లో
117,
యూపీలో
403,
మణిపూర్
లో
28,
ఉత్తరాఖండ్
లోని
70
సీట్లు
ఉన్నాయి.
వీటికి
వివిధ
దశల్లో
ఎన్నికల
నిర్వహణకు
వీలుగా
ఈసీ
షెడ్యూల్
విడుదల
చేసింది.
కోవిడ్
పరిస్ధితుల
దృష్ట్యా
ప్రతీ
పోలింగ్
బూత్
లోనూ
ఓటర్ల
సంఖ్యను
1250కి
తగ్గిస్తూ
ఈసీ
కీలక
నిర్ణయం
తీసుకుంది.
గతంలో
ఈ
సంఖ్య
1500గా
ఉండేది.
ఈ
ఎన్నికల్లో
ఐదు
రాష్ట్రాల్లోని
మొత్తం
18..34
కోట్ల
మంది
ఓటర్లు
తమ
ఓటు
హక్కు
వినియోగించుకోనున్నారు.
ఐదు
రాష్ట్రాల్లో
మొత్తం
24.5
లక్షల
కొత్త
ఓటర్లు
ఈసారి
ఓటేయబోతున్నారు.
అభ్యర్ధులకు
ఆన్
లైన్
లో
నామినేషన్
దాఖలు
చేసే
అవకాశాన్ని
ఈసీ
కల్పించింది.
అభ్యర్ధులపై
నమోదైన
క్రిమినల్
కేసుల్ని
తప్పనిసరిగా
టీవీ
ఛానళ్లు,
పత్రికల్లో
బహిర్గతం
చేయాలని
ప్రధాన
ఎన్నికల
కమిషనర్
సుశీల్
చంద్ర
తెలిపారు.