వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే, మాత్రోశ్రీ మాస్టర్ ప్లాన్, ముంబైలో కలకలం !

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే అంటూ ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లక్సీలు ముంబై నగరంలో కలకలం రేపాయి. శివసేన కార్యకర్తలు ముంబై నగరంతో పాటు మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్న ఈ పోస్టర్లు చూసిన బీజేపీ నాయకులు ఆందోళకు గురౌతున్నారు. ముంబైలో ఠాక్రే నివాసం మాత్రోశ్రీ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లతో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి !

మహారాష్ట్ర ముఖ్యమంత్రి !

ముంబైలో శనివారం దర్శనం ఇచ్చిన మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే పోస్టర్లు తీవ్రచర్చకు దారితీశాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖరారైయ్యింది. అయితే శివసేన చెప్పిన 50.50 ఫ్మార్ములా ఇప్పడు బీజేపీ నాయకులకు తలనొప్పిగా తయారైయ్యింది.

50.50 ఫ్మార్ములా

50.50 ఫ్మార్ములా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము చెప్పిన 50.50 ఫార్ములాకు కట్టుబడి ఉన్నామని, అందులో ఎలాంటి మార్పు లేదని శివసేన తేల్చి చెప్పింది. శివసేన ఫ్మార్ములాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.

మొదటి సారి ఎమ్మెల్యేకి సీఎం పదవి ?

మొదటి సారి ఎమ్మెల్యేకి సీఎం పదవి ?

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో పర్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే భారీ మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రేని సీఎం చెయ్యాలని శివసేన నాయకులు నిర్ణయించారు. రాజకీయ అనుభవం ఏమాత్రం లేని ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీలో చాల మంది నాయకులు వెనకడుగు వేస్తున్నారు.

మాత్రోశ్రీ మాస్టర్ ప్లాన్

మాత్రోశ్రీ మాస్టర్ ప్లాన్

ఇదే సమయంలో ముంబైలోని ఠాక్రే నివాసం అయిన మాత్రోశ్రీ ముందు శనివారం మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే అనే పోస్టర్లు దర్శనం ఇచ్చాయి.మహారాష్ట్రలో ఇటీవల మొత్తం 288 నియోజక వర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఇద్దరికీ అధికారం

ఇద్దరికీ అధికారం

బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 చోట్ల విజయం సాధించాయి. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి బీజేపీకి శివసేన మద్దతు ఎంతో అవసరం. 50.50 ఫార్ములా ప్రకారం శివసేన రెండున్నర సంవత్సరం, బీజేపీ రెండున్న సంవత్సరం అధికారం పంచుకోవాలి.

శరద్ పవార్ దెబ్బ

శరద్ పవార్ దెబ్బ

ఇదే సమయంలో శివసేనను ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. శివసేన చేస్తున్న డిమాండ్ లో న్యాయం ఉందని శరత్ పవార్ అంటున్నారు. బీజేపీ 50.50 ఫ్మార్ములాకే ఓకే అని చెప్పకుంటే ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సిద్దంగా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత కాలం అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం మరోసారి అధికారానికి దూరం కావడానికి సిద్దంగా లేదని సమాచారం.

English summary
Mumbai: A Poster put up outside Thackeray residence reads 'CM Maharashtra only Aditya Thackeray'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X