వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా బాధితుల ఇళ్లకు పోస్టర్లు అంటించొద్దు- కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఐసీఆర్‌ సాయంతో కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఇందులో అత్యధిక శాతం జనామోదం పొందుతుండగా, పలుసార్లు కొన్నింటిపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిలో తాజాగా కేంద్రం జారీ చేసిన ఓ మార్దదర్శం వివాదాస్పదమవుతోంది. దీనిపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

కరోనా రోగుల ఇళ్ల బయట పోస్టర్టు అంటించాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా వైరస్ సోకిన వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా అప్రమత్తం చేసేందుకు కేంద్రం ఈ పోస్టర్లు అంటించాలని సూచించింది. అయితే సుప్రీంకోర్టు తాజాగా ఈ ఆదేశాలను పక్కనపెట్టింది. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేకంగా నోటిఫై చేస్తే తప్ప ఇలా కరోనా రోగుల ఇళ్లకు పోస్టర్లు అంటించడం సరికాదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

Posters should not be affixed outside homes of COVID patients: Supreme Court

కరోనా సోకిందంటూ రోగుల ఇళ్లకు పోస్టర్లు అతికించడం ద్వారా సదరు బాధితుల గౌరవానికి భంగం కలిగినట్లు అవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఈ పోస్టర్ల వ్యవహారమేంటంటూ కేంద్రానికి అక్షింతలు వేసింది. తక్షణం ఈ ఆదేశాలను సవరించాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది. దీంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా పలు చోట్ల మాత్రం ఇంకా కేసుల సంఖ్య కనిపిస్తోంది. దీంతో కేంద్రం కూడా స్దానిక అధికారులకు కట్టడి చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేస్తోంది.

English summary
The Supreme Court on Wednesday took note of the Centre’s guidelines and said that posters and signage should not be affixed by the authorities outside the homes of COVID-19 patients in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X