వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక పటుత్వ పరీక్ష: స్వామి నిత్యానంద మగాడే?

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాదాస్పద స్వామీజీ, బిడది ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామి పురుషుడేనని లైంగిక పటుత్వ పరీక్షల్లో తేలినట్లు సమాచారం. అతనికి ఎట్టకేలకు బెంగళూర్‌లోని విక్టోరియా ఆస్పత్రిలో సోమవారం సుదీర్ఘంగా పురుషత్వ పరీక్షలు జరిగాయి. మహిళపై అత్యాచారం చేసినట్టు నిత్యానందపై ఆరోపణలున్నాయి.

కేసుల విచారణ సందర్భంగా తాను పురుషుడినే కానని, అత్యాచారం చేసేంత సామర్థ్యం తనకు లేదని నిత్యానంద కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో పురుషత్వ పరీక్షలకు తెర లేచింది. పురుషత్వ పరీక్షలపై ఆదేశాలను రద్దు చేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన నిత్యానందకు హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఎదురు దెబ్బ తగిలింగి.

పురుషత్వ పరీక్షలకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు, సుప్రీంకోర్టు తేల్చిచెప్పాయి. దీంతో పురుషత్వ పరీక్షలకు నిత్యానంద హాజరుకాక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం నిత్యానంద వ్యక్తిగత న్యాయవాదులతో పరీక్షలకు హాజరయ్యారు.

Potency test: Nithyananda proved as male

ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ దుర్గణ్ణ పర్యవేక్షణలో వివిధ విభాగాల నిపుణులు నిత్యానందకు ఉదయం నుంచి సాయంత్రం దాకా పరీక్షలు చేశారు. మనోవ్యాధి నిపుణుడు నిత్యానంద నుంచి 18 ప్రశ్నలకు సమాధానాలను సేకరించారు.

నిత్యానందకు రక్త, చెమట, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అతడి శరీరంలోని అన్ని అవయవాలను పరీక్షించిన వైద్యులు అన్నీ దృఢంగానే ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. వీర్యం సేకరించే విషయంలో న్యాయవాదులకు, సిఐడి అధికారులకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. తప్పనిసరిగా వీర్యం ఇవ్వాల్సిందేనన్న సిఐడి వాదనతో ఆయన వీర్యం ఇచ్చారు.

మడివాళలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌ కేంద్రం నిపుణులుధ్వని పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఒకటి, రెండు రోజుల్లో సీఐడీ అధికారులకు అందజేస్తామని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు.

English summary
It is said that potency test proved Swami Nithyananda as male. Potency test has been conducted at Victoria hospital in Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X