వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదరికమే కమలం టార్గెట్... నేడు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల...

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలో మేనిఫెస్టోల సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ని పార్టీలు తమ పథకాలతో దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ సమీపిస్తున్న క్రమంలో బీజేపీ సోమవారం తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. కనీస ఆదాయ హామీ పథకం (న్యాయ్‌) కింద అత్యంత పేద కుటుంబాలకు ఏటా 72,000 రూపాయల నగదు సాయం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పేదరిక నిర్మూలనపై బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఏ అంశాలను చేర్చుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

బీజేపీ మ్యానిఫెస్టో ప్రధానంగా ఉగ్రవాదం, అభివృద్ధి, మహిళా సాధికారత, రామమందిర నిర్మాణం వంటి అంశాలపై దృష్టిసారించనుంది. ఇక నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుండటంతో యువతకు ఉపాధి, నైపుణ్యాల కల్పనపైనా బీజేపీ మ్యానిఫెస్టో ఎలాంటి ప్రస్తావన తీసుకువస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పార్టీ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొంటారు.

Poverty is the Lotus Target ... Today the BJP Manifesto released ...
English summary
It looks like the Manifestos season is running in the country. All parties make cosmic efforts to impress the nation with their schemes. The BJP will release its election manifesto on Monday in the upcoming polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X