• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేపాల్ భూకంపం 20 అణు బాంబులతో సమానం, ప్రపంచ దేశాల సాయం

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: నేపాల్ రాజధాని ఖాఠ్మండులో సంభవించిన భూకంపం ఆ దేశ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. గత కొన్నేళ్లలో ఎన్నో భూకంపాలకు సాక్ష్యాభూతమైన నేపాల్, శనివారం సంభవించిన భూకంపానికి నేల మట్టమైంది.

నేపాల్‌లో గత మూడు రోజులుగా సంభవించన భూ ప్రకంపనలు సుమారు 3600కు పైగా జనాభాన్ని పొట్టుపెట్టుకుంది. ఇంకా మృతుల సంఖ్యపై ఒక స్పష్టతకు రాలేక పోతుంది నేపాల్ ప్రభుత్వం. శనివారం సంభవించిన భూకంపం రిక్టర్‌స్కేల్‌పై 7.9గా నమోదైంది.

గత 80 సంవత్సరాల్లో నేపాల్ ప్రజలు ఎక్కువగా గాయపడిన భూకంపం ఇదేననంటున్నారు. శనివారం నేపాల్‌లో సంభవించిన భూకంపం 20 అణు బాంబులతో సమానమని నిపుణులు పేర్కొన్నారు. హిరోషిమా అణు బాంబు దాడుల కంటే అనేక రెట్లు ఎక్కువ అని తెలిపారు.

Power of Nepal earthquake was equivalent to 20 huge atomic bombs

నేపాల్ రాజధాని ఖాఠ్మండులోని జనాభా ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఈ భూ ప్రకంపం రావడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. రాజధానిలోని పురాతన భవనాలు, చారిత్రక కట్టడాలు సైతం నేలకొరిగిన విషయం తెలిసిందే. నేపాల్ భూకంప ప్రభావం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరంపైనా పడింది. ఎవరెస్ట్ శిఖరంపైనున్న మంచు పెళ్లలు విరిగిపడడంతో 18 మంది పర్వాతారోహకులు మరణించారు.

చాలా మంది పర్వాతారోహకులు బేస్ క్యాంప్ వద్ద చిక్కుకున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 1 వద్ద 150 మంది ఉన్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు మూడు హెలికాప్టర్లను బేస్ వద్దకు పంపించినట్లు తెలుస్తోంది. నేపాల్ భూకంపం, మంచు కారణంగా ఎవరెస్ట్ బేస్ క్యాంపు కూడా ధ్వంసమైంది. ప్రపంచంలోని చాలా దేశాల తమ వంతు సహాయంగా నేపాల్‌కు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి.

భారత్ ప్రభుత్వం 'ఆపరేషన్ మైత్రి' పేరుతో నేపాల్‌కు అన్నిరకాలుగా సహకారం అందుతుందని హామీ ఇచ్చారు. వరుస భూకంపాలతో అతలాకుతలమైన నేపాల్ ప్రజలను ఆదుకునేందుకు గాను 70 మందితో కూడిన సహాయక బృందం, సమాగ్రితో కూడిన ప్రత్యేక విమానాన్ని సోమవారం ఉదయం అమెరికా నుంచి పంపించింది. దీంతో పాటు నేపాల్‌కు పది లక్షల డాలర్లు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. నార్వే 39 లక్షల డాలర్ల సాయాన్ని ప్రకటించింది.

ఇక మన దేశం నుంచి ఇప్పటికే 13 సైనిక విమానాల్లో మందులు, మొబైల్ హాస్పిటళ్లు, టెంట్లు, బ్లాంకెట్లు, భారీ స్థాయిలో మంచినీళ్లు, ఆహారాన్ని కేంద్రం నేపాల్ కు పంపించింది. జాతీయ విపత్తు సహాయ దళం నుంచి 700 మందికి పైగా సిబ్బందిని సహాయ చర్యలకు రంగంలోకి దిపింది.

నేపాల్‌లో మౌలిక వసతుల కల్పనకు 50 కోట్ల రూపాయల సహాయం ప్రకటించింది. మధ్యప్రదేశ్ సర్కార్ కూడా 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ కు యూకే 5 మిలియన్ ఫౌండ్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. తక్షణ సహాయంగా 3 మిలియన్ ఫౌండ్లను విడుదల చేసినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. అయితే మిగిలిన 2 మిలియన్ ఫౌండ్లను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించనున్నట్లు యూకే వెల్లడించింది.

English summary
Nepal has been hit by a number of earthquakes over the years, as you might expect given its proximity to Everest and the world's tallest mountain range created by the collision of two giant tectonic plates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X