వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ నిరసన దీక్షకు రంగం సిద్దం (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

హొసూరు (తమిళనాడు): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాషను కాపాడటం కోసం గళం విప్పనున్నారు. ఆ నిరసన దీక్షా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో బెంగళూరు నగర శివార్లలోని హోసూరులో నిరసన దీక్షకు ఎర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు భాషాభిమానులు రంగంలోకి దిగారు. తమిళనాడులో నిర్బంధ తమిళ భాష చట్టాన్ని వ్యతిరేకిస్తు చేస్తున్న ఈ పోరాటానికి సుమారు లక్ష మంది మద్దతిస్తారని ఆ రాష్ట్రంలోని తెలుగు సంఘాలు అంటున్నాయి.

తమిళనాడులో తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం (మైనారిటీ బాషలు) విద్యాభ్యాసానికి విద్యార్థులు దూరమైపోతున్నారు. తమిళనాడులో ఈ భాషల పాఠశాలలు మూతపడటానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పుడు మాతృ భాషను కాపాడుకోకుంటే ఇక భావితరాల వారు వారి మాతృ భాషను మరిచిపోతారని ప్రవాసాంధ్రులు వాపోతున్నారు.

పవన్ మేనియా

పవన్ మేనియా

బెంగళూరు నగరానికి కేవలం 30 కిలోమీట దూరంలో హోసూరు (తమిళనాడు) ఉంది. అక్కడ వేలాధి మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు.

పవర్ పని చేస్తుంది

పవర్ పని చేస్తుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసే నిరసన దీక్ష వలన లాభం ఉంటుందని, తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తుందని పలు తెలుగు సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీక్షకు జనసమీకరణ

దీక్షకు జనసమీకరణ

తెలుగు సంఘాలు అంతా ఒక్కటై పవన్ కళ్యాణ్ దీక్షకు పూర్తి మద్దతివ్వాలని నిర్ణయించారు. అదే విధంగా తెలుగు ప్రజలను ఒక్కటి చెయ్యడానికి సిద్దం అయ్యారు.

తెలుగు తమ్మళ్లు మద్దతు

తెలుగు తమ్మళ్లు మద్దతు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు తమిళనాడులో పవన్ చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు ఇవ్వడానికి సిద్దం అయ్యారు.

మూడు రాష్ట్రాల నుంచి

మూడు రాష్ట్రాల నుంచి

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని తెలుగు వారు పవన్ కళ్యాణ్ నిరసన దీక్షకు మద్దతు ఇవ్వడానికి సిద్దం అయ్యారు.

చంద్రబాబు అండ

చంద్రబాబు అండ

తమిళనాడులోని హోసూరు ప్రాంతానికి సమీపంలోనే కుప్పం నియోజక వర్గం ఉంది. పవన్ దీక్షకు తమ నియోజక వర్గం నుంచి పార్టీ కార్యకర్తలు పంపించడానికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

అనుమతి ఇస్తారా

అనుమతి ఇస్తారా

పవన్ కళ్యాణ్ నిరసన దీక్షకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అని పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎర్ర ఎన్ కౌంటర్ సమస్య

ఎర్ర ఎన్ కౌంటర్ సమస్య

తిరపతి సమీపంలోని శేషాచలం అడవులలో జరిగిన ఎన్ కౌంటర్ లో పలువురు తమిళ కూలీలు అంతం అయ్యారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

శాసన సభ్యుడు, చెర్మేన్ తెలుగు వారే

శాసన సభ్యుడు, చెర్మేన్ తెలుగు వారే

హోసూరు శాసన సభ్యుడు గోపినాథ్, మునిపల్ చెర్మేన్ బాలకృష్ణా రెడ్డి పక్కా తెలుగు వారు. గోపినాథ్ తమిళనాడు అసెంబ్లీ సమావేశాలలో పలు సమస్యలను తెలుగులోనే మాట్లాడారు. ముఖ్యమంత్రి జయలలిత నుంచి తెలుగు లోనే సమాదానం రాబట్టారు.

చివరి ప్రయత్నం

చివరి ప్రయత్నం

తమిళనాడులో తెలుగు బాషను కాపాడుకోవడానికి, తెలుగు పాఠశాలలను రక్షించుకోవడానికి ఇప్పుడు చివరి ప్రయత్నం చేస్తున్నారు. వారికి మద్దతిస్తూ పవన్ దీక్ష చేయ్యడానికి సిద్దం అవుతున్నారు.

English summary
Government of the neighborhood state had implemented a GO of the Nirbhanda Tamil, that students of minority languages couldn't get to study in their mother tongue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X