తమిళనాడు ఎన్నికలు: బిజెపిలోకి చెన్నై పవర్ స్టార్
చెన్నై: నటుడు, పవర్ స్టార్ శ్రీనివాసన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 'లతికా' చిత్రం ద్వారా కోలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకున్న ఇతను 'కన్నా లడ్డు తిన్న ఆశైయా' తదితర పలు కామెడీ చిత్రాల్లో తన హాస్యంతో చాలామంది అభిమానులను సంపాధించుకున్నారు.
పలు వివాదాల్లో చిక్కుకుని తమిళ చిత్రసీమలో అవకాశాలను కొంచెం కొంచెం జారవిడుచుకున్న ఆయన కేంద్ర సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ సమక్షంలో సోమవారం బిజెపిలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ ఈ ఏడాది ప్రారంభంలో ఆర్సీ పాల్ కనగరాజ్ స్థాపించిన తమిళ్ మానిలా కచ్చి పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇతను కొత్త పార్టీని స్థాపించి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా చెలరేగాయి.
శ్రీనివాసన్ తన కెరీర్‌ను మెడికల్ ప్రాక్టిషనర్‌గా ప్రారంభించారు. క్రమంగా సినీ రంగంలోకి ప్రవేశించారు. తానే నటుడిగా, సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత 2014లో కన్నా లడ్డు తిన్న అశైయా సినిమా ద్వారా అతనికి మంచి బ్రేక్ వచ్చింది. దీంతో పలు ఆఫర్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications