బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు సెంట్రల్ జైలుకు పవర్ స్టార్, చీటింగ్ కేసులు, ఢిల్లీలో రూ. 500 కోట్లు, అక్కడ !

బ్యాంకులో రుణం ఇప్పిస్తానని వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో కోలీవుడ్ పవర్ స్టార్ శ్రీనివాసన్ ను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బ్యాంకులో రుణం ఇప్పిస్తానని వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో కోలీవుడ్ పవర్ స్టార్ శ్రీనివాసన్ ను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో బెంగళూరులో శ్రీనివాసన్ మీద కేసు నమోదు అయ్యింది.

మోడీ మాటంటే: కారు నిలిపిన కేంద్ర మంత్రి, గోడ పక్కనే పోశారు, సెక్యూరిటీ ఇలా, వైరల్ !మోడీ మాటంటే: కారు నిలిపిన కేంద్ర మంత్రి, గోడ పక్కనే పోశారు, సెక్యూరిటీ ఇలా, వైరల్ !

బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త మన్సూర్ ఆలంను కోలీవుడ్ పవర్ స్టార్ శ్రీనివాసన్ కలిశాడు. తరువాత బ్యాంకులో రూ. 30 కోట్లు రుణం ఇప్పిస్తానని మన్సూర్ ఆలంను నమ్మించాడు. బ్యాంకు రుణం ఇప్పించడానికి తనకు కమిషన్ ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నాడు.

కమిషన్ అంటూ రూ. ఒక కోటి

కమిషన్ అంటూ రూ. ఒక కోటి

బ్యాంకు రుణం ఇప్పించడానికి ఖర్చు అవుతోందని మన్సూర్ ఆలంను నమ్మించిన పవర్ స్టార్ శ్రీనివాసన్ ఆయన దగ్గర ఒక కోటి రూపాయలు తీసుకున్నారు. ఎంత కాలం అయినా బ్యాంకు రుణం రాకపోవడంతో మన్సూర్ ఆలంకు అనుమానం వచ్చింది.

ఈ రోజు కాదు రేపు వస్తోంది

ఈ రోజు కాదు రేపు వస్తోంది

మన్సూర్ ఆలంకు అనుమానం వచ్చిన వెంటనే పవర్ స్టార్ శ్రీనివాసన్ ను సంప్రదించారు. శ్రీనివాసన్ ఈ రోజు, రేపు అంటూ కాలం గడుపుతూ వచ్చారు. అయితే ఇక బ్యాంకు రుణం ఇప్పించలేరని తెలుసుకున్న వ్యాపారవేత్త మన్సూర్ ఆలం తాను ఇచ్చిన కోటి రూపాయలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

నీ దిక్కున్న చోట చెప్పుకో

నీ దిక్కున్న చోట చెప్పుకో

అయితే కోటి రూపాయలు తిరిగి ఇవ్వని శ్రీనివాసన్ నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ మన్సూర్ ఆలంను బెదిరించారు. మోసం జరిగిందని గుర్తించి మన్సూర్ ఆలం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పవర్ స్టార్ శ్రినివాసన్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు.

ఢిల్లీలో రూ. 500 కోట్లు

ఢిల్లీలో రూ. 500 కోట్లు

కోలీవుడ్ పవర్ స్టార్ శ్రీనివాసన్ మీద ఇప్పటికే ఢిల్లీలో ఓ కేసు నమోదు అయ్యింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ కన్ స్ట్రక్షన్ కంపెనీ నిర్వహకులను కలిసిన శ్రీనివాసన్ వారికి బ్యాంకులో రూ. 500 కోట్లు రుణం తీసిస్తానాని నమ్మించాడు. తనకు సినీరంగంతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు తెలుసని నమ్మించారు.

ఢిల్లీలో కేసు నమోదు

ఢిల్లీలో కేసు నమోదు

రూ. 500 కోట్ల బ్యాంకు రుణం ఇప్పించడానికి రూ. 10 కోట్లు కమిషన్ ముందుగానే మాట్లాడుకున్నారు. ఆ సంస్థ నుంచి రూ. 10 కోట్లు తీసుకున్న శ్రీనివాసన్ తరువాత తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారు. మోసం జరిగిందని గుర్తించిన ఆ సంస్థ నిర్వహకులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తీహార్ టూ బెంగళూరు

తీహార్ టూ బెంగళూరు

కేసు నమోదు చేసిన పోలీసులు గత మే నెలలో శ్రీనివాసన్ ను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. అప్పటి నుంచి పవర్ స్టార్ శ్రీనివాసన్ తీహార్ జైల్లో ఉన్నాడు. కోర్టు ముందు హాజరుపరచడానికి శ్రీనివాసన్ ను బాడీ వారెంట్ మీద తీహార్ జైలు నుంచి బెంగళూరు తీసుకు వచ్చారు.

కోలీవుడ్ పవర్ స్టార్

కోలీవుడ్ పవర్ స్టార్

కోలీవుడ్ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసన్ అనేక తమిళ సినిమాల్లో హాస్య నటుడిగా నటించారు. సినిమాల్లో నటిస్తూ ఆయన బ్యాంకు రుణం ఇప్పిస్తానని అనేక మందిని మోసం చేశాడని కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరు కోర్టులో హాజరుపరిచిన తరువాత మళ్లీ శ్రీనివాసన్ ను తీహార్ జైలుకు తరలించనున్నారు.

English summary
The actor, who was arrested in cheating case, has been detained in Bangalore jail. Power Star Srinivasan was already jailed in Tihar jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X