• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Prabhas ప్రెస్టీజియస్ సినిమాను చుట్టుముట్టిన వివాదం...సెట్స్ పైకి వెళ్లకముందే రగడ..!

|

స్టార్ట్... యాక్షన్...కెమెరా... అనే మూడు పదాలు ఇంకా అనకముందే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సైన్ చేసిన చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కన్నడంలో కేజీఎఫ్‌ అనే సూపర్ హిట్‌ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ హైబడ్జెట్ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేయడంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఈ మూవీ గురించి చర్చించుకుంటోంది. ఇంతకీ ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లని ఈ చిత్రంను వెంటాడుతున్న వివాదం ఏంటి...?

బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్

బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్

ప్రభాస్... యంగ్ రెబల్ స్టార్.. బాహుబలి.. ఇలా ఏ పేరు చెప్పినా దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలు సలాం కొడతాయి. ఒకే ఒక చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా అవతారమెత్తిన డార్లింగ్ ప్రభాస్... ఇప్పుడు ఏ చిత్రం సైన్ చేసినా సంచలనంగానే మారింది. బాహుబలి చిత్రం తర్వాత సాహో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా... ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పెద్ద ఎత్తున ఈ చిత్రానికి ఖర్చు చేయడం జరిగింది. బాహుబలి తర్వాత విడుదల అయిన చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సాహో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఛత్రపతి వరుస చిత్రాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఒకప్పుడు ప్రభాస్ చిత్రం అంటే కనీసం ఒక ఏడాది కాలం పాటు అభిమానులు వేచిచూసేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

సలార్ చిత్రంపై వివాదం

సలార్ చిత్రంపై వివాదం

బాహుబలి చిత్రం తర్వాత ఈ హ్యాండ్సమ్ హంక్ సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనంతరం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన డార్లింగ్ ప్రభాస్... సినిమా షూటింగులకు అనుమతులు రావడంతో తన పనిలో బిజీ అయిపోయాడు. తాజాగా కేజీఎఫ్ మూవీ మేకర్స్ ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను "సలార్"గా నిర్ణయించారు. ఇంకా సెట్స్ పైకి ఈ చిత్రం వెళ్లకముందే వివాదాల సుడిగుండంలో చుట్టుకుంది. ఇప్పటికే మూవీ పోస్టర్ చూస్తే ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే తాను తీయబోయే చిత్రాలకు సంబంధించిన మొత్తం బడ్జెట్ చూస్తే అది రూ.1200 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తోంది. దీంతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.

ఇదీ టైటిల్‌గా అరబ్ భాషలో ఉన్న పదం

ఇక అసలు విషయానికొస్తే ప్రభాస్ తీస్తున్న చిత్రం "సలార్" టైటిల్‌పై వివాదం చెలరేగింది. ఈ చిత్రాన్ని తీస్తున్నది కన్నడ డైరెక్టర్.. నిర్మిస్తున్నది కూడా కన్నడ నిర్మాతే. అయితే కన్నడ టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టకుండా అరబ్ భాషలో ఉన్న పదాన్ని టైటిల్‌గా పెట్టడమేంటంటూ కర్నాటకలోని ప్రశాంత్ సంబర్గీ అనే సామాజికవేత్త ప్రశ్నించారు. ఇప్పటికే పలు అంశాలపై ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచే సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబర్గీ తాజాగా ఓ సినిమా టైటిల్‌గా అరబిక్ పేరును పెట్టడాన్ని తప్పుబట్టారు. భారత దేశంలో ఆరు ప్రాచీన భాషలు ఉండగా... ప్రభాస్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్‌లకు ఈ భాషల నుంచి టైటిల్ దొరకలేదా అని ప్రశ్నించారు. సలార్ అనే అరబిక్ టైటిల్‌ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ చిత్ర బృందం సలార్ అనే టైటిల్‌ను గురువారం ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకులు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.

  Kriti Sanon To Play Sita In Prabhas Starrer Adipurush?
  భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్

  భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్

  ఇదిలా ఉంటే ప్రభాస్ వరుస సినిమాల తీసేందుకు సైన్ చేశారు. ఇప్పటికే రాధేశ్యామ్, ఆదిపురుష్‌ చిత్రాలతో పాటు దీపికా పదుకొణే హీరోయిన్‌గా వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్‌లో మరో చిత్రం చేయనున్నాడు ప్రభాస్. ఇది సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని టాలీవుడ్ టాక్. ఇక తాజా చిత్రం సలార్ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో తొలిసారి నటించబోతున్నాడు ప్రభాస్‌. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోంది. అదే సమయంలో కన్నడలో ప్రభాస్‌కు తొలి చిత్రం కానుంది. మొత్తానికి సెట్స్ పైకి వెళ్లకముందే వివాదాలు చుట్టుముట్టిన సలార్ చిత్రంలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సిందే.

  English summary
  Pan India star Prabhas new movie titled Salaar had raised eyebrows from the karnataka social activist Prashanth sambargi as the title is in Arabic language.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X