వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమె భారతదేశ అమాయక పుత్రిక : శివరాజ్ సింగ్ చౌహన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నోటిదురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాద్వి ప్రజ్ఞా ఠాకూర్ అమాయక భారతదేశ పుత్రికగా అభివర్ణించారు బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్. ఆమె భారతదేశ దేశభక్తురాలు అని .. ఆమెపై మాలేగావ్ పేలుడుకు సంబంధించి తప్పుడు అభియోగాలు నమోదు చేశారని ఆరోపించారు. కానీ భోపాల్ లోక్ సభ నుంచి సాద్వీ భారీ మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ సరికాదు ...

ఇదీ సరికాదు ...

ఈ ఘటనకు సంబంధించి చట్టాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. కానీ సాద్వీ మాత్రం పేలుడుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కానీ సాధ్వీపై హిందు ఉగ్రవాది అని ముద్ర వేశారని తెలిపారు. ఆ పేలుడుకు సంబంధించి దిగ్విజయ్ సింగ్‌కు సంబంధం ఉన్నదని ఆరోపించారు. భోపాల్ నుంచి స్వాధ్వీపై కాంగ్రెస్ పార్టీ నుంచి దిగ్విజయ్ బరిలోకి దిగారు. ఈ క్రమంలో శివరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 1989 నుంచి భోపాల్ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈసారి సాధ్వీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్గీ రాజా పోటీకి దిగడంతో విజయవకాశాలు ఎలా ఉంటాయోననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బ్రహ్మాస్త్రం .. సాద్వీ

బ్రహ్మాస్త్రం .. సాద్వీ

తమ సాంప్రదాయ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించిన విజయం తథ్యమేనని శివారాజ్ అభిప్రాయపడ్డారు. కానీ దిగ్విజయ్ పోటీలో ఉన్నందున .. తమ అస్త్రం సాధ్వీని బీజేపీ బయటకు తీసిందని పేర్కొన్నారు. పేలుళ్లకు సంబంధించి ఎన్ఐఏ తన చార్జీషీట్ వెనక్కి తీసుకుందని, దీనికి కారణం ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడమేనని గుర్తుచేశారు. కానీ ఈ కేసు విచారణ ముంబై కోర్టులో జరుగుతోందని వెల్లడించారు. ఓ భారతీయురాలిగా, బీజేపీ కార్యకర్తగా సాద్వీ ఎందుకు పోటీ చేయకూడదో చెప్పాలని శివరాజ్ డిమాండ్ చేశారు.

ద్రౌపది అలా .. సాద్వీ ఇలానా ?

ద్రౌపది అలా .. సాద్వీ ఇలానా ?

అంతేకాదు మహాభారతంలో ద్రౌపదికి వేధింపులను మనం చూస్తుంటాం. కానీ సాద్వీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించేందుకు మాత్రం వెనుకాడుతామని పేర్కొన్నారు శివరాజ్ సింగ్. ఇటీవల హేమంత్ కర్కేపై సాధ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలను సాధ్వీ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివరాజ్ సింగ్ సాద్వీ .. అమాయక భారతదేశ పుత్రికగా అభివర్ణించారు.

English summary
Pragya Thakur, the 2008 Malegaon blast accused who has collected two notices with her controversial comments after becoming the BJP's candidate from Bhopal in the national election, was described as "a patriot and an innocent daughter of India" by Shivraj Singh Chouhan, a senior party leader. "She will win Bhopal with a huge majority," he pronounced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X