వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ సంతోషంగా ఉన్నారా: ప్రకాశ్‌రాజ్, పద్మావతి నుంచి పాకిస్తాన్ దాకా.. ట్విట్టర్‌లో సెటైర్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

మోడీ సంతోషంగా ఉన్నారా: ప్రకాశ్‌రాజ్, ట్విట్టర్‌లో సెటైర్లు

అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇటీవల పలు అంశాల్లో ప్రధాని మోడీపై ఆయన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ గెలుపుతో మరోసారి స్పందించారు.

మోడీ నిజంగా సంతోషంగా ఉన్నారా అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. మోడీకి శుభాకాంక్షలు, అభివృద్ధి మంత్రంతో 150 సీట్లు గెలుస్తామని చెప్పారని, మరి ఏమయిందని, ఇప్పటికైనా మీరు ఒక్క క్షణం ఆలోచించాలని, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సమస్యలు, పేదరికం, గ్రామీణ భారతంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్‌లా

గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపిన విషయం తెలిసిందే. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చింది. ఓ సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందేమో అనే టెన్షన్ బీజేపీ నేతలలో కనిపించింది. చివరకు వంద సీట్ల వరకు గెలుచుకొని బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బీజేపీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటూ ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

పోస్టులు హల్‌చల్

గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోడీ మాట్లాడిన ఔరంగజేబు, తీవ్రవాదం, పాకిస్తాన్, సీ ప్లేన్, మణిశంకర్ వ్యాఖ్యలు బీజేపీ గెలుపుకు ఉపకరించాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి.

పద్మావతి సినిమా

చాలా రోజులుగా పద్మావతి సినిమా వాయిదా పడుతోన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ రాజ్‌పుత్‌ల ఓట్లు కూడా చాలా కీలకం. ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు అయిపోయినందున... పద్మావతి విడుదలకు డేట్ విడుదల కావొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీ టార్గెట్ 150పై ఇలా లెక్క

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు గెలిచేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ వంద సీట్లకు పరిమితమైంది. అంతకుముందు 108 సీట్ల ఆధిక్యంలో ఉంది. ఈ సమయంలో జగ్దీష్ శెట్టి అనే ఓ ట్విట్టరిటీ ఇలా లెక్క చూపించారు. బీజేపీ టార్గెట్ 150 అని, అని, 150 సీట్లపై 28% జీఎస్టీ విధిస్తే 42 వస్తాయని, ఆ మొత్తం తగ్గగా 150 నుంచి 42 సీట్లు పోతే 108 బీజేపీ గెలుస్తోందని పేర్కొన్నారు.

గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ

మరో ట్విట్టరిటీ గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితిని ఇలా చెప్పారు. క్రమంగా ఆ పార్టీ కనుమరుగు అయిందంటూ ఈ పోస్టు పెట్టారు.

గెలవక ముందు పాకిస్తాన్, గెలిచాక పాకిస్తాన్

గుజరాత్ ఎన్నికలకు ముందు మోడీ పాకిస్తాన్‌పై మాట్లాడిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఓ ట్విట్టరిటీ ఈ పోస్ట్ పెట్టారు. ఎన్నికలకు ముందు మోడీ పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారని, బీజేపీ గెలిచిన తర్వాత మోడీ భక్తులు పాకిస్తాన్‌కు థ్యాంక్స్ చెబుతున్నారని ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీపై ఆసక్తికర ట్వీట్

ఆమ్ ఆద్మీ పార్టీ గురించి పీయూష్ షా అనే ట్విట్టరిటీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ 182 స్థానాలకు 11 స్థానాల్లో పోటీ చేసిందని, అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని పేర్కొన్నారు. 171 స్థానాల్లో డిపాజిట్ సేవ్ చేసిందని వ్యాఖ్యానించారు.

English summary
'Dear prime minster, Congratulations for the victory... but are you really happy' Actor Prakash Raj tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X