బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ అంటే ఇష్టం లేదు, సుమలతకు మద్దతు, సీఎం కొడుకు అవసరమా ? నటుడు ప్రకాష్ రాజ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సయాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ కు ఆయన భార్య సుమలత జీవితాంతం తోడు ఉన్నారని బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. సుమలత మండ్య కోడలు అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలని, ప్రకాష్ రాజ్ అన్నారు. సుమలతకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, బీజేపీ అంటే తనకు ఇష్టం లేదని ప్రకాష్ రాజ్ చెప్పారు.

ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ, సిద్దరామయ్య రహస్య చర్చలు, మోడీ జిందాబాద్: టెక్కీల నినాదాలు !ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ, సిద్దరామయ్య రహస్య చర్చలు, మోడీ జిందాబాద్: టెక్కీల నినాదాలు !

సుమలతకు రాజకీయాలు తెలీదు అనడంలో అర్థం లేదని, ఆమెకు తన సంపూర్ణ మద్దతు ఉందని ప్రకాష్ రాజ్ చెప్పారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో ఉన్నారు. బెంగళూరులోని మాగడి రోడ్డులో ఉన్న అంజన్ సినిమా థియేటర్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన తన రాజీయ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు.

సుమలత హక్కు

సుమలత హక్కు

మండ్య ప్రజలు చాలా ఆలోచించాలని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుమలత రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు సుమలతకు ఉందని ప్రకాష్ రాజ్ చెప్పారు.

మంచి వ్యక్తి

మంచి వ్యక్తి

తనకు సుమలతతో అనేక స���వత్సరాల నుంచి పరిచయం ఉందని, ఆమె చాల మంచి వ్యక్తి అని, ఆమెకు తన సంపూర్ణ మద్దతు ఉందని ప్రకాష్ రాజ్ తెలిపారు. సుమలత లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఎంతో సేవ చేసే అవకాశం ఉంటుందని ప్రకాష్ రాజ్ అన్నారు.

ఆ వయసు లేదు

ఆ వయసు లేదు

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామికి రాజకీయాల్లోకి వచ్చే వయసు లేదని ప్రకాష్ రాజ్ చెప్పారు. నిఖిల్ కుమారస్వామి ఇంత త్వరగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఉందా అని ప్రకాష్ రాజ్ అన్నారు.

చెడ్డ పేరు వస్తుంది

చెడ్డ పేరు వస్తుంది

కొంత కాలం క్రితమే సినీ రంగంలో ప్రవేశించిన నిఖిల్ కుమారస్వామి ఆ రంగంలో పైకి రావడానికి ప్రయత్నించాలని ప్రకాష్ రాజ్ సలహా ఇచ్చారు. రాజకీయ కుటుంబంలో ఉన్నాననే ఒక్క కారణంతో నిఖిల్ కుమారస్వామి రాజకీయల్లోకి వస్తే చాలా చెడ్డపేరు వస్తుందని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక���తం చేశారు.

ప్రజల నిర్ణయం

ప్రజల నిర్ణయం

నిఖిల్ కుమారస్వామి రాజకీయంగా పైకి రావాలా ? వద్దా ? అనే విషయం ప్రజలు నిర్ణయిస్తారని ప్రకాష్ రాజ్ చెప్పారు. నాకు వ్యక్తిగతంగా బీజేపీ, ఆ పార్టీ పరిపాలన అంటే ఇష్టం లేదని ప్రకాష్ రాజ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తనకు ఆప్, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ఇచ్చాయని ప్రకాష్ రాజ్ చెప్పారు.

మాజీ ప్రధానితో భేటీ

మాజీ ప్రధానితో భేటీ

లోక్ స�� ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఇటీవల మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మద్దతు కోరానని, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తాను ఆలోచిస్తానని హామీ ఇచ్చారని ప్రకాష్ రాజ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తాను మద్దతు కోరానని ప్రకాష్ రాజ్ చెప్పారు. బెంగళూరు లోక్ సభ నియోజక వర్గంలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవలేదని, అందుకే ఆ పార్టీని తనకు మద్దతు ఇవ్వాలని మనవి చేశానని ప్రకాష్ రాజ్ అన్నారు.

English summary
Bengaluru central constituency Independent candidate Prakash raj expressed his support to mandya candidate Sumalatha Ambareesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X