వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి ఖాయం, కౌంటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన ప్రకాశ్‌రాజ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ ఎన్నిక కౌంటింగ్ జరుగుతుంది. వార్ వన్ సైడ్ అన్నట్టు బీజేపీ అభ్యర్థి విజయం వైపు దూసుకెళ్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఆశీనులైన ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రకాశ్‌రాజ్ ఉండి ఏం చేయాలనుకున్నారో ఏమో కానీ .. లెక్కింపు కొనసాగుతుండగానే వెళ్లిపోయారు.

బరిలో హేమహేమీలు ..
బెంగళూరు సెంట్రల్ నుంచి కాంగ్రెస్ నుంచి రిజ్వాన్ అర్షద్, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్ బరిలోకి దిగారు. ప్రకాశ్ రాజ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఇక్కడినుంచి బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోంది. ఈసారి ప్రకాశ్ రాజ్ పోటీ చేయడంతో కాస్త ఉత్కంఠ రేపింది. కానీ ఓటుబ్యాంకుగా మలచుకోలేకపోయారు. ప్రస్తుతం మోహన్ 4.9 లక్షల ఓట్లతో దూసుకెళ్తుండగా .. అర్షద్ 4.7 లక్షల ఓట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నారు. ప్రకాశ్ మోహన్ కంటే దాదాపు 24 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. దీంతో ఇక తన విజయం కల్లేనని భావించారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండి ఏం చేయాలో తెలియలేదు. ఓడిపోతున్నానని భావించి సెంటర్ నుంచి తన అనుచరులతో కలిసి వెళ్లిపోయారు.

prakash raj leave counting center becoz bjp candidate lead

పోల్స్ ముందే చెప్పాయి ..
వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా చెప్పాయి. అయితే అవి ఫేక్ అని ప్రకాశ్ రాజ్ కొట్టిపారేశారు. ఓట్ల లెక్కింపుతో తన విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. సిట్టింగ్ బీజేపీ ఎంపీ లీడ్‌లో ఉన్నారు. దేశంలో హేతువాదులపై జరుగుతున్న దాడులను ప్రకాశ్ రాజ్ ఖండిస్తున్నారు. మోదీ, అమిత్ షా విధానాలను తప్పుపడుతున్నారు. అందులోభాగంగానే ఆయన లోక్ సభ స్థానానికి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు.

English summary
Bangalore Central counting will be going on. The BJP wins confirm. Independent Candidate at the Counting Center, Prakash raj and what he wanted to do, but the counting went on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X