వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎం భద్రత,ట్యాంపరింగ్ వార్తలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రణబ్ ముఖర్జీ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు బాగా నిర్వహించారని ఎన్నికల కమీషన్‌ను ప్రశంసించిన ఒక్కరోజులోనే మాజీ రాష్ట్ర్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈవీఎంల భద్రతపై వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈవీఎంలను భద్రపరిచి ఓటరు తీర్పును వెలువరించిన పూర్తి బాధ్యత ఎన్నికల కమీషన్‌కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.దీంతోపాటు కమీషన్ యొక్క నిబద్దతపై కూడ ప్రజలకు అనుమానాలు రేకెత్తకుండా చూడాల్సిన భాద్యత ఈసీపై ఉందని ఆయన సూచించారు.

కాగా ఓటర్ల తీర్పును ట్యాంపరింగ్ చేస్తున్నరన్న వార్తలపై నేరుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గోన్న ప్రణబ్ ముఖర్జి తెలిపారు. కాగా మొదటి ఎలక్షన్ కమీషనర్ నుండి ప్రస్థుతం ఉన్న ఎలక్షన్ కమీషనర్లు బాగా పనిచేశారని చెప్పిన ఆయన ఎన్నికల కమీషన్ యొక్క సమగ్రతతోపాటు నిబద్దత అంశంపై ప్రజలకు భరోస కల్పించాల్సిన భాద్యత ఎన్నికల కమీషన్‌కు ఉందని ఆయన సూచించారు.కాగా రాహుల్ ఈసీ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Pranab Mukherjee expressed concern over tampering of voters verdict

కాగా ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువరించిన తర్వాత అనూహ్యంగా దేశంలోని ప్రతిపక్షపార్టీలు ఈవీఎంల భద్రత పై ఆందోళన వ్యక్తం చేశారు.కాగా ఎగ్జిట్‌పోల్స్ తర్వాత ఫలితాల్లో కూడ ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని వారు ఆరోపించారు. ఈనేపథ్యంలోనే వంద శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల కమీషన్ మాత్రం సుప్రిం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఐదు బూతులలో మాత్రమే వీవీ ప్యాట్ స్లిప్‌లను సరిపోల్చనున్నారు. అయితే వీటిపై పలు ఆందోళన చేస్తున్న తర్వాత ప్రణబ్ ముఖర్జి స్పందించడం ఈవీఎం ఫలితాల ట్యాంపరింగ్ మరింత అనుమానాలు వ్వక్తం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
former president Pranab Mukherjee concern over tampering of votersSafety and security of EVMs is Election Commission’s responsibility,” Mukherjee said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X