వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 రోజులు సంతాప దినాలు - ప్రణబ్ మృతిపై కేంద్రం ప్రకటన - కార్యాలయాల్లో జెండా అవనతం

|
Google Oneindia TeluguNews

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశం తన ముద్దుబిడ్డను కోల్పోయినవేళ ఏడు రోజుల పాటు సంతాపదినాలుగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంతాపదినాలకు సూచనగా రాష్ట్రపతి భవన్, కేంద్ర సెక్రటేరియట్, పార్లమెంట్ భవనం తదితర కీలక కార్యాలయాల్లో జాతీయ జెండాను సగం వరకు అవతనం చేశారు.

అర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటేఅర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటే

సంతాప దినాలు పాటించే ఈ ఏడు రోజులూ(ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను అవతనం(సగం కిందికి దించి) చేసి ఉంచుతారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ మరణవార్తను తొలుత ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విటర్ లో వెల్లడించారు. అనంతరం రాజకీయ నేతలు, ప్రముఖులు, విదేశీ నేతలు మొదలుకొని సామాన్య ప్రజల వరకు సంతాపం ప్రకటించారు.

Pranab Mukherjees demise: Govt announces 7-day mourning

దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందని, ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్ ను ప్రజలకు మరింత చేరువ చేసిన ఘనత ప్రణబ్ ముఖర్జీదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. భారతరత్న ప్రణబ్ మరణవార్త విని యావత్ దేశం విలపిస్తున్నదిని, దేశాభివృద్ధిలో ఆయనది చెరగని ముద్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు.

తెలంగాణతో ప్రణబ్‌ ముఖర్జీకి ఎంతో అనుబంధం - బిల్లుపైనా సంతకం - సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతితెలంగాణతో ప్రణబ్‌ ముఖర్జీకి ఎంతో అనుబంధం - బిల్లుపైనా సంతకం - సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

English summary
The central government has announced seven-day state mourning on demise of former President Pranab Mukherjee. Pranab passes away at 84, on monday. The Indian flag is flown at half-mast at the Rashtrapati Bhavan as a mark of respect for former president Pranab Mukherjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X