chidambaram lk advani pranab mukherjee rss indira gandhi jawahar lal nehru congress bjp ప్రణబ్ ముఖర్జీ ఇందిరా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ బీజేపీ ఎల్కే అద్వానీ చిదంబరం
సర్! ఆరెస్సెస్ సమావేశాలకు వెళ్లండి కానీ: ప్రణబ్ ముఖర్జీకి చిదంబరం సూచన
న్యూఢిల్లీ: నాగపూర్‌లో వచ్చే నెల 7వ తేదీన జరగనున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శిక్షా వర్గ్‌కు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరు కానుండటం చర్చనీయాంశంగా మారింది. ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లవద్దని, పునరాలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రణబ్‌కు సూచనలు చేస్తున్నారు.
కాంగ్రెస్-బీజేపీలకు షాక్, కేసీఆర్ ఫ్రంట్‌కు మమత దన్ను, దాదా వెనుక దీదీ: ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్?
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం ఆయనకు ఓ సూచన చేశారు. ఆయనను ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లనివ్వాలన్నారు. అయితే, అక్కడ ఆరెస్సెస్ చేసే తప్పులను ఆయన ఎత్తి చూపాలన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానానికి ప్రణబ్ ఇప్పటికే ఒప్పుకున్నారని, ఎందుకు ఒప్పుకున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం కాదని, అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే... సర్ (ప్రణబ్) అక్కడికి వెళ్లండి.. వారి భావజాలంలో ఏయే తప్పులున్నాయో చెప్పండని చిదంబరం సూచించారు.
అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల మాట్లాడుతూ.. ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తమను ఆస్చర్యానికి గురి చేసిందన్నారు. అయితే ఆరెస్సెస్ వంటి జాతీయ భావాలు కలిగిన సంస్థ సమావేశాలకు గతంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి కూడా హాజరయ్యారని గుర్తు చేస్తున్నారు.