వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐపై కుట్రలో ప్రశాంత్ భూషణ్ హస్తం!?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీజేఐపై కుట్ర వెనుక సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉన్నారని ప్రముఖ లాయర్ ఎంఎల్ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ రంజన్ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.

ఈవీఎంను ప్రశ్నిస్తే జైలు నిబంధనపై ఈసీకి సుప్రీం నోటీస్ఈవీఎంను ప్రశ్నిస్తే జైలు నిబంధనపై ఈసీకి సుప్రీం నోటీస్

సీజేఐపై కుట్ర వెనుక ప్రశాంత్ భూషణ్‌, ఇందిరా జై సింగ్‌తో పాటు ఏడుగురు ఉన్నారన్నది ఎంఎల్ శర్మ ఆరోపణ. కుట్ర వెనుక తానున్నానని స్వయంగా ఆయన ఒప్పుకున్నారని కోర్టుకు విన్నవించారు. అయితే ఈ అంశంపై విచారణకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. వేరే ధర్మాసనం ముందు ప్రస్తావించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. దీంతో ఎంఎల్ శర్మ ఈ విషయాన్ని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

Prashant bhushan behind conspiracy against CJI

ప్రశాంత్ భూషణ్, ఇందిరా జై సింగ్‌లు ఉద్దేశపూర్వకంగా సీజేఐపై కుట్ర పన్నుతున్నారని ఎంఎల్ శర్మ జస్టిస్ అరుణ్ మిశ్రా దృష్టికి తెచ్చారు. దీనిపై పిటీషన్ దాఖలు చేస్తానని, అత్యవసర విచారణ జరపాలని కోరారు. అయితే శర్మ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.

English summary
Advocate ML Sharma today sought to mention a matter relating to the sexual harassment allegations against Chief Justice of India Ranjan Gogoi. CJI Gogoi, however, asked Sharma to mention the matter before some other Bench. after CJI Gogoi refused to hear the mentioning, it is learnt that Sharma later mentioned the matter before Justice Arun Mishra, who said that he does not hear mentioning of matters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X