హౌడీ మోడీ ప్రోగ్రామ్‌పై ప్రశాంత్ కిషోర్ స్పందన..ఏమన్నారంటే ?
న్యూఢిల్లీ: హౌడీ మోడీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకమైన అడుగు వేశారని కొనియాడారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నందున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని కోరుతూ మోడీ చేసిన ప్రసంగం ఆకట్టుకుందంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ తీసుకుంటున్న విధానాలతో వలసదారులు ముఖ్యంగా అమెరికాలో సెటిల్ అయిన భారతీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో హౌడీ మోడీ కార్యక్రమం ఇటు ట్రంప్‌కు అటు మోడీకి కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
2020లో అమెరికా అధ్యక్ష పదవికోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై అక్కడి సెటిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక భారత ప్రధానితో కలిసి ఒకే వేదికపై సభను ఉద్దేశించి ఒక అమెరికా అధ్యక్షుడు కలిసి ప్రసంగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదే ఇరు దేశాధినేతలకు కలిసొచ్చింది. అదే సమయంలో భారతీయుల ఓట్లు అక్కడ ట్రంప్‌కు చాలా కీలకం కానున్నాయి. ఇక ఈ సభతో భారతీయులంతా ట్రంప్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.

భారత ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల హౌడీ మోడీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రధానాంశాల్లో నిలిచింది. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది ఇండో - అమెరికన్లు హాజరయ్యారు. ఇక ఇండో అమెరికన్ ఓట్లపై కన్నేసిన ట్రంప్.. తను అధ్యక్షుడిగా కాకముందు భారత్‌కు ఈ స్థాయిలో అమెరికా ఎప్పుడూ మిత్రదేశంగా వ్యవహరించలేదని అన్నారు. భారత్ తమకు నిజమైన మిత్రుడని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఆప్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
A strategic and smart move by the Indian PM to build some meaningful leverage on an “electorally vulnerable” US President about to face elections...using one of our biggest advantages - “the numbers” like never seen before. And in a democracy, that matters!!
— Prashant Kishor (@PrashantKishor) September 23, 2019
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications