వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హౌడీ మోడీ ప్రోగ్రామ్‌పై ప్రశాంత్ కిషోర్ స్పందన..ఏమన్నారంటే ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హౌడీ మోడీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకమైన అడుగు వేశారని కొనియాడారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నందున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని కోరుతూ మోడీ చేసిన ప్రసంగం ఆకట్టుకుందంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ తీసుకుంటున్న విధానాలతో వలసదారులు ముఖ్యంగా అమెరికాలో సెటిల్ అయిన భారతీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో హౌడీ మోడీ కార్యక్రమం ఇటు ట్రంప్‌కు అటు మోడీకి కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

2020లో అమెరికా అధ్యక్ష పదవికోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై అక్కడి సెటిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక భారత ప్రధానితో కలిసి ఒకే వేదికపై సభను ఉద్దేశించి ఒక అమెరికా అధ్యక్షుడు కలిసి ప్రసంగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదే ఇరు దేశాధినేతలకు కలిసొచ్చింది. అదే సమయంలో భారతీయుల ఓట్లు అక్కడ ట్రంప్‌కు చాలా కీలకం కానున్నాయి. ఇక ఈ సభతో భారతీయులంతా ట్రంప్‌‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు.

Prashant Kishor lauds Modi for strategic move in Howdi Modi programme

భారత ప్రధాని మోడీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల హౌడీ మోడీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రధానాంశాల్లో నిలిచింది. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది ఇండో - అమెరికన్లు హాజరయ్యారు. ఇక ఇండో అమెరికన్ ఓట్లపై కన్నేసిన ట్రంప్.. తను అధ్యక్షుడిగా కాకముందు భారత్‌కు ఈ స్థాయిలో అమెరికా ఎప్పుడూ మిత్రదేశంగా వ్యవహరించలేదని అన్నారు. భారత్ తమకు నిజమైన మిత్రుడని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఆప్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

English summary
Prashant Kishore an election strategist had hailed the move of Indian Prime Minister Modi at Howdi Modi programe by inviting Trump. Prashant Kishore said in a tweet that the move was "strategic and smart move"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X