• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

త్వరలో తృతీయ ఫ్రంట్‌ ? పవార్‌తో మళ్లీ పీకే భేటీ-రేపు కాంగ్రెసేతర పార్టీలకు ఆహ్వానం

|

దేశంలో ఎన్డీయే వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం, ప్రాంతీయ పార్టీలు మినహా జాతీయ స్ధాయిలో సత్తా చూపే కూటమి లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. దీంతో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడగట్టి 2024 కల్లా ఓ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీల్ని గెలుపుబాట పట్టిచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌తో కలిసి వరుసగా రెండోదశ చర్చలు జరిపారు.

 పవార్‌తో మళ్లీ ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ

పవార్‌తో మళ్లీ ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ

కాంగ్రెస్‌ పార్టీ పతనంతో దేశ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను భర్తీ చేసేందుకు తెరవెనుక జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార ఎన్డీయేను ఢీకొట్టే ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరుగుతుండటం, అదే సమయంలో జాతీయ స్దాయిలో వాటికి నాయకత్వం వహించే వారు కరువవడంతో ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్‌ తెరపైకి వస్తోంది. ఇందుకోసం ఇప్పటికే జూన్‌ 12న భేటీ అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌... ఇవాళ మరోసారి కలిసి చర్చలు జరిపారు.

 తృతీయ ఫ్రంట్‌పై ఊహాగానాలు

తృతీయ ఫ్రంట్‌పై ఊహాగానాలు

ఈ నెలలో పవార్‌తో ప్రశాంత్ కిషోర్ వరుసగా రెండోసారి భేటీ కావడంతో తృతీయ ఫ్రంట్‌పై ఊహాగానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ తమ రాజకీయాధికారాన్ని సుస్ధిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికల్ని కూడా ఈ ద్వయం తోసిపుచ్చడం లేదు. అందుకే సాధ్యమైనంత త్వరగా తృతీయ కూటమి ఏర్పాటు చేయడంపై ఇరువురు నేతలు సీరియస్‌గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ భేటీ తర్వాత కూడా ప్రశాంత్‌ కిషోర్‌ బయటికీ ఏమీ చెప్పకుండానే కేవలం మర్యాదపూర్వక భేటీ అని చెప్పి వెళ్లిపోయారు.

పీకేతో భేటీలో ఎన్సీపీ కీలక నేతలు

పీకేతో భేటీలో ఎన్సీపీ కీలక నేతలు

ఈ నెల 12న జరిగిన భేటీలో కేవలం పవార్, పీకే మాత్రమే పాల్గొన్నారు. కానీ ఈసారి మాత్రం మహారాష్ట్ర ఎన్సీపీలో కీలకమైన ఇద్దరు నేతల్ని పవార్‌ భేటీకి ఆహ్వానించారు. వీరిలో ఒకరు మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ కాగా.. మరొకరు పవార్ మేనల్లుడు రోహిత్‌ పవార్. అయితే ఈ భేటీలో పార్టీలో కీలక నేతలుగా ఉన్న ప్రఫుల్ పటేల్, పవార్‌ మరో మేనల్లుడు అజిత్ పవార్‌కు మాత్రం పిలుపు లేకపోవడం చర్చనీయాంశమైంది. వీరిద్ద్రరు ఎన్డీయే నేతలతో గతంలో టచ్‌లో ఉండటంతో వీరిని ఈ భేటీకి దూరంగా ఉంచారు.

తృతీయ ఫ్రంట్‌పై త్వరలో ప్రకటన ?

తృతీయ ఫ్రంట్‌పై త్వరలో ప్రకటన ?

తాజాగా పవార్‌-పీకే వరుస భేటీల నేపథ్యంలో అటు మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న శివసేన, ఎన్సీపీ నేతలు జాతీయ స్ధాయిలో ఎన్డీయేకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ లీకులు ఇస్తున్నారు. దీంతో తాజాగా పీకే గెలిపించిన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ వంటి పార్టీలతో్ ధర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలో ఓ ప్రకటన వస్తుందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఓసారి క్లారిటీ వచ్చాక పవార్‌-పీకే మిగతా నేతలతో కలిసి ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.

రేపు కాంగ్రెసేతర పార్టీల నేతలతో పవార్‌ భేటీ

రేపు కాంగ్రెసేతర పార్టీల నేతలతో పవార్‌ భేటీ

జాతీయ స్ధాయిలో ఎన్డీయే సర్కార్‌కూ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు వీలుగా అన్ని రాజకీయ పక్షాల్నీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న పవార్‌-పీకే ద్వయం ముందుగా కాంగ్రసేతర పార్టీలతో చర్చించబోతోంది. దీంతో రేపు భేటీకి రావాలని కాంగ్రెసేతర పార్టీల నేతలకు పవార్‌ ఫోన్లు చేస్తున్నారు. అయితే ఈ భేటీలో ప్రశాంత్‌ కిషోర్‌ పాల్గొంటారో లేదో ఇంకా తేలలేదు. తాజాగా బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల్లో విజయాలతో జోరు మీదున్న ప్రశాంత్‌ కిషోర్‌ సలహాతోనే పవార్ ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏకాభిప్రాయం కుదిరితే తృతీయ ఫ్రంట్‌ త్వరలోనే సాకారం కావొచ్చని తెలుస్తోంది.

English summary
political strategist prashant kishor on today meet nationalist congress party chief sharad pawar in new delhi amid speculations over formation of third front to take on nda in 2024.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X