వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన ప్రశాంత్ కిషోర్ .. ఆ ఎన్నికలకు పని చేయనని క్లారిటీ

|
Google Oneindia TeluguNews

రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు.ఉప ఎన్నికలు జరగాల్సిన 24 అసెంబ్లీ స్థానాల కోసం ప్రచారాన్ని నిర్వహించడానికి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతిపాదనను తాను అంగీకరించానని వచ్చిన నివేదికలను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఖండించారు.

మమతా బెనర్జీ నిర్ణయం: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు 'జడ్‌ కేటగిరీ’ భద్రత .. !!మమతా బెనర్జీ నిర్ణయం: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు 'జడ్‌ కేటగిరీ’ భద్రత .. !!

 మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఉప ఎన్నికల ప్రచారానికి నో చెప్పిన పీకే

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఉప ఎన్నికల ప్రచారానికి నో చెప్పిన పీకే

సీనియర్ నాయకుడు బిజెపికి మారిన తరువాత జ్యోతిరాదిత్య సింధియా విధేయులు వైదొలగడంతో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. జ్యోతిరాదిత్య సింథియా తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన ప్రశాంత్ కిశోర్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాత్రమే కాదు, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని తనను కోరారని, కానీ తాను అంగీకరించలేదని పేర్కొన్నారు .

కాంగ్రెస్ కోసం ముక్కలు, ముక్కలుగా పని చెయ్యటానికి ఆసక్తి చూపని పీకే

కాంగ్రెస్ కోసం ముక్కలు, ముక్కలుగా పని చెయ్యటానికి ఆసక్తి చూపని పీకే

తాను కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల కోసం ముక్కలు, ముక్కలుగా పని చెయ్యటానికి ఆసక్తి చూపించటం లేదని పీకే పేర్కొన్నారు . 2014 లో ప్రధాని నరేంద్ర మోడీ కోసం భారీ విజయవంతమైన ప్రచారంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా తన కెరీర్‌లో అరంగేట్రం చేసిన కిషోర్, అప్పటి బిజెపి చీఫ్ అమిత్ షాతో విభేదాల తరువాత పార్టీతో విడిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కోసం ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, కేజ్రీవాల్ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది, ఇది 2015 రికార్డు ఫలితాలను దాదాపుగా ప్రతిబింబిస్తుంది.

Recommended Video

Thalapathy Vijay Fans Put Up Posters With AP CM YS Jagan & Prashant Kishore
రాజకీయ వ్యూహాలలో దిట్ట .. సీఎం జగన్ కు అద్భుత విజయం అందించిన ప్రశాంత్ కిషోర్

రాజకీయ వ్యూహాలలో దిట్ట .. సీఎం జగన్ కు అద్భుత విజయం అందించిన ప్రశాంత్ కిషోర్

ఇక గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ కోసం పని చేశారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి అఖండ విజయం అందించటంలో కీలకంగా పని చేశారు . తన రాష్ట్రంలో బిజెపి సవాల్‌ను ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకె స్టాలిన్ డిఎంకెతో కూడా పీకే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ప్రస్తుతం వారి కోసం పీకే పని చేస్తున్నారు . పీకే ఏ పార్టీ కోసం పని చేస్తే ఆ పార్టీ విజయాలను అందుకుంటుంది అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది . ఇక ఈ నేపధ్యంలోనే పీకే రాజకీయ వ్యూహాల కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి.

English summary
Election strategist Prashant Kishor has categorically denied reports that he accepted an offer from Madhya Pradesh Congress to handle its campaign for the 24 assembly seats where by-elections need to be held.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X