వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌తో మాజీ ప్రేయసి క్లోజ్‌గా..: వీడియో చూసి ప్రత్యూష అప్‌సెట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య నేపథ్యంలో నటి రాఖీ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలోని ఆడకూతుళ్లను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో సీలింగ్ ఫ్యాన్లను బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

భారత్ మాతాకీ జై నినాదం విషయమై చర్చ కంటే ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్లు బ్యాన్ చేయడం విషయమై ఆలోచించడం మంచిదని చెప్పారు. ప్రత్యూషది హత్యేనని రాఖీ సావంత్ అభిప్రాయపడ్డారు. ప్రియుడు రాహుల్ రాజా సింగ్ ప్రత్యూషను వేధించేవాడని చెప్పారు.

ప్రత్యూషను వేధించవద్దని తాను పలుమార్లు సూచించానని చెప్పారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకోలేదని, ముమ్మాటికి అది హత్యేనని ఆరోపించారు. ప్రత్యూష కుటుంబానికి ప్రభుత్వం రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాల్నారు. నిందితుడ్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

Pratyusha Banerjee suicide: Ban ceiling fans to save India’s daughters, Rakhi Sawant requests Modi

ప్రత్యూష ఊపిరాడక చనిపోయినట్టయితే... ఆమె ముఖం మీద ఏర్పడ్డ గాయాలకు కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యూష ప్రియుడు అంత షాక్‌కు గురైతే... ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రిలో చేర్చి, ఆమె ఫోన్ పట్టుకుని ఎందుకు వెళ్లిపోయాడని నిలదీశారు.

రాహుల్ ప్రియురాలు ప్రత్యూషకు పంపిన వీడియోలు ఆ మొబైల్‌లో ఉన్నాయని రాఖీ సావంత్ తెలిపింది. రాహుల్ మాజీ ప్రియురాలు తాను సన్నిహితంగా కొన్ని వీడియోలను ప్రత్యూషకు పంపించిందని రాఖీ చెప్పారు. రాహుల్ రాజ్ నిజాలు అంగీకరించి పోలీసులకు లొంగిపోతే బాగుండేదని, ఇప్పుడు షాక్ అంటూ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు.

రాహుల్‌పై ఎఫ్ఐఆర్

ప్రత్యూష ఆత్మహత్య కేసులో పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రత్యూష ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌ను రెండుసార్లు విచారించిన పోలీసులు.. ప్రత్యూష ఆత్మహత్యకు కారణం రాహుల్ అని తేల్చారు. రాహుల్ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

English summary
Pratyusha Banerjee suicide: Ban ceiling fans to save India’s daughters, Rakhi Sawant requests Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X