వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ ప్రత్యూష ప్రియుడికి ఊరట

By Pratap
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: చిన్నారి పెళ్లి కూతురు టీవీ సీరియల్ ఫేమ్, టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు సోమవారంనాడు నిరాకరించింది. రాహుల్ గతంలోనే బొంబాయి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.

ట్విస్ట్: రాహుల్ గురించి ప్రత్యూషకు తెలిసిన అసలు నిజం, డేటింగ్ వద్దన్నాట్విస్ట్: రాహుల్ గురించి ప్రత్యూషకు తెలిసిన అసలు నిజం, డేటింగ్ వద్దన్నా

తన కూతురు మరణానికి కారకుడైన రాహల్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వరాదంటూ ప్రత్యూష తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ మహారాష్ట్ర పోలీసులు దరఖాస్తు ఏదైనా చేశారా అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఆరా తీసింది.

రాహుల్‌తో మాజీ ప్రేయసి క్లోజ్‌గా..: వీడియో చూసి ప్రత్యూష అప్‌సెట్రాహుల్‌తో మాజీ ప్రేయసి క్లోజ్‌గా..: వీడియో చూసి ప్రత్యూష అప్‌సెట్

Pratyusha Banerjee suicide case: SC rejects her mother’s plea to cancel Rahul Raj’s bail

మహారాష్ట్ర పోలీసులు అటువంటి దరఖాస్తు ఏదీ దాఖలు చేయలేదని ప్రత్యూష తల్లి తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలనే ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలనే ఆమె విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

బుల్లితెర 'ఆనంది' మృతి: అందరి వేళ్లూ ప్రియుడివైపే..!బుల్లితెర 'ఆనంది' మృతి: అందరి వేళ్లూ ప్రియుడివైపే..!

ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిద్ధార్థ్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ప్రత్యూష మరణానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని, విచారిస్తున్నామని ముంబై పోలీసులు అప్పట్లో చెప్పారు.

English summary
Supreme Court dismissed the plea of Soma Banerjee as withdrawn as a bench did not accept the plea that he should be charged for murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X