వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యూష కేసులో కీలక మలుపు: ఆయన ఔట్, ఈయన ఇన్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ కేసులో మరో ట్విస్ట్. ప్రత్యూషకు న్యాయం జరగాలని వాదిస్తున్న ఆమె తరఫు లాయర్ బ్రహ్మభట్ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

తనకు, ప్రత్యూష కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రత్యూష కేసును స్పెషల్ ప్రాసిక్యూటర్‌కు అప్పగించాలని ఆయన సూచించారు. ప్రత్యూషకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అయితే, ఆయన వైదొలగడం వెనుక ఓ కారణం ఓన్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యూష తల్లిదండ్రులు ఈ కేసు వాదించాల్సిందిగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీలేష్‌ను కోరారని తెలుస్తోంది. నీలేష్‌తో కలిసి పని చేయడం ఇష్టం లేకే బ్రహ్మభట్ వైదొలగినట్లుగా తెలుస్తోంది.

ఇక్కడ మరో విషయం ఏమంటే నీలేష్ ఎవరో కాదు. గతంలో రాహుల్ రాజ్ సింగ్ తరఫున వాదించిన లాయర్. ఆ తర్వాత అతను రాహుల్ కేసు నుంచి తప్పుకున్నారు. అదే లాయర్‌ను వాదించాలని ప్రత్యూష తల్లిదండ్రులు కోరారు.

ప్రత్యూష

ప్రత్యూష

ప్రత్యూష ఈ నెల ఏప్రిల్ ఒకటో తేదిన ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు.

ప్రత్యూష

ప్రత్యూష

ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెది ముమ్మాటికి హత్యేనని ఆమె స్నేహితులు ఆరోపించారు. రాహుల్ రాజ్ సింగ్ వైపు అందరూ వేలు చూపించారు.

ప్రత్యూష

ప్రత్యూష


అదే సమయంలో ప్రత్యూష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ రాజ్ పైన ఆత్మహత్యకు పురికొల్పినట్లుగా కేసు నమోదయింది.

 ప్రత్యూష

ప్రత్యూష

ఆ తర్వాత రాహుల్ రాజ్ సింగ్ తరఫున నీలేష్, ప్రత్యూష తల్లిదండ్రుల తరఫున బ్రహ్మభట్ వాదనకు ముందుకు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత నీలేష్.. రాహుల్ తరఫున వాదించనంటూ బయటకు వచ్చారు.

 ప్రత్యూష

ప్రత్యూష

ఆ తర్వాత ప్రత్యూష తల్లిదండ్రులు లాయర్ నీలేష్ వద్దకు వెళ్లి తమ లాయర్‌తో కలిసి వాదించాలని కోరినట్లుగా తెలుస్తోంది. నీలేష్‌తో పని చేయడం ఇష్టం లేకనే బ్రహ్మభట్ స్వయంగా తొలగినట్లుగా తెలుస్తోంది.

English summary
Pratyusha Banerjee underwent abortion days before her death; 'Balika Vadhu' actress' lawyer quits the case?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X