వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసుపత్రి నుంచి దూకేస్తా!: ప్రియుడు, ప్రత్యూష పేరెంట్స్ ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆసుపత్రి భవనం నుంచి దూకేస్తానని హెచ్చరించాడు.

ప్రత్యూష ఈ నెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. రాహుల్ రాజ్ సింగ్... ప్రత్యూషను ఆసుపత్రిలో అడ్మిడ్ చేసి ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఒత్తిడి తదితరాల కారణంతో ఓ ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తాజాగా, ఓ విషయం వెలుగు చూసింది. శుక్రవారం నాడు రాహుల్ రాజ్ సింగ్ ఆసుపత్రిలోని తన గదిలోని వాష్ రూంలో లోపలకి లాక్ చేసుకున్నాడు. అంతేకాదు, తాను భవనం పై నుంచి దూకేస్తానని బెదిరించాడు. అతను ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఒత్తిడిలో అతను దూకేస్తానని చెప్పాడని తెలుస్తోంది.

 Pratyusha death case: Her boyfriend Rahul Raj Singh threatens to jump off hospital building

మరోవైపు, ప్రత్యూష తల్లిదండ్రులు పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. తమ కూతురు ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని, రాహుల్ రాజ్ సింగ్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాహుల్ రాజ్ సింగ్ విచారణకు సహకరించకుండా ఉండేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని, ఇందుకు సంబంధించి రాహుల్, ఆసుపత్రి మేనేజ్‌మెంట్ మధ్య కుట్రపూరిత ఒప్పందం ఉన్నట్లుగా ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకే అతనికి ఆసుపత్రి యాజమాన్యం షెల్టర్ ఇస్తోందని ఆరోపించారు.

English summary
After sudden demise of popular TV actress Pratyusha Banerjee in mysterious circumstances in her Mumbai apartment, her parents filed complaint to the Indian Medical Association (IMA) seeking action against the city based hospital Sri Sai Hospital for shielding Pratyusha's boyfriend, who was admitted there to avoid complete investigation over the suicide case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X