వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యకు ముందు బాగా తాగింది: ప్రత్యూష కేసులో మరో ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఇరవై ఐదు రోజుల క్రితం 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. తాజాగా, తుది మెడికల్ రిపోర్టులో మరిన్ని షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. ప్రత్యూష ఏప్రిల్ 1వ తేదీన ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం మేరకు... ఆమె ఆత్మహత్యకు ముందు 135 ఎంజీ ఆల్కాహాల్ తీసుకుందని తుది మెడికల్ రిపోర్టులో ఉందని తెలుస్తోంది. ఇది యావరేజ్ కంటే చాలా ఎక్కువ (ఆల్కాహాల్) తీసుకోవడమేనని చెబుతున్నారు. ఇంత మొత్తంలో ఆల్కాహాల్ తీసుకుంటే ఆ వ్యక్తి లేదా ఆ మహిళ తన ఆదీనంలో తాను ఉండరు.

ఆత్మహత్యకు ముందు ఆమె ఆల్కాహాల్ తీసుకున్నదని తెలిసినందున, అది కూడా పరిమితిని మించి తీసుకున్నదని తెలిసినందున... ఆత్మహత్య చేసుకునే సమయానికి ప్రత్యూష కూడా తన ఆదీనంలో తాను లేదని తెలుస్తోందని అంటున్నారు.

కాగా, ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రత్యూష బెనర్జీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రతయూష స్నేహితులు కూడా అదే చెబుతున్నారు.

Pratyusha suicide case: Here is what final report of death has revealed

ఇదిలా ఉండగా, ప్రత్యూష ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రత్యూషకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండేవని, ప్రముఖ బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకుని తీవ్ర ఒత్తిడికి గురైందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఆమె డబ్బంతా వాళ్ల అమ్మ అకౌంటులో డిపాజిట్‌ చేసేదని ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌ ఆరోపించాడు. అంతేకాక ప్రియాంకకు డ్రగ్స్‌, ఆల్కహాల్‌ మోతాదుకు మించి తీసుకోవడం అలవాటైందని, ఈ విషయం ఆమె స్నేహితులకు కూడా తెలుసుని రాహుల్‌ రాజ్ సింగ్ పేర్కొంటున్నాడు.

మరోవైపు ప్రియాంక అకౌంట్‌ నుంచి ఆమె ప్రియుడు రాహుల్‌ డబ్బు డ్రా చేశాడని ప్రియాంక తల్లి తరఫు లాయర్‌ వాదిస్తున్నారు. ప్రత్యూష మృతి కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించాలని ఆమె తల్లి షోమా బెనర్జీ పెట్టిన పిటిషన్‌ బాంబే హైకోర్టు ఇటీవలె తిరస్కరించింది.

English summary
After so many twists and turns in the popular TV actress Pratyusha Banerjee suicide case, now the final medical report has revealed something shocking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X