వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్పోసిస్ కొత్త సిఈఓ ప్రవీణ్‌రావు?

విశాల్‌ సిక్కా రాజీనామాతో ఖాళీ అయిన ఇన్ఫోసిస్‌ సీఈవో పదవిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అయితే సిక్కా రాజీనామా అనంతరం ఇన్ఫోసిస్‌ తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన య

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: విశాల్‌ సిక్కా రాజీనామాతో ఖాళీ అయిన ఇన్ఫోసిస్‌ సీఈవో పదవిపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అయితే సిక్కా రాజీనామా అనంతరం ఇన్ఫోసిస్‌ తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన యూబీ ప్రవీణ్‌ రావే ఈ పదవిలో కొనసాగుతారని ప్రచారం సాగుతోంది.

బీజీ శ్రీనివాస్‌, అశోక్‌ వేమూరిలు కంపెనీ కొత్త సీఈవో రేసులో ఉన్నారంటూ వచ్చిన వార్తలను కొందరు కొట్టిపారేస్తున్నాయి. కంపెనీలో భాగమైన వారినే కొత్త సీఈవోగా నియమించాలని మేనేజ్‌మెంట్‌ డిమాండ్ చేస్తోంది. అప్పుడైతేనే కంపెనీ నీతులను అర్థం చేసుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నాయి.

Pravin Rao likely to continue as Infosys CEO: Sources

బీజీ శ్రీనివాస్‌ మళ్లీ కంపెనీలోకి వచ్చే అవకాశం లేదంటూ తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నందన్‌ నిలేకని ఎక్కువగా కంపెనీ అంతర్గత అభ్యర్థిని కొత్త సీఈవోగా ఎంపికచేయాలని కసరత్తు చేయడమే దీనికి ప్రధాన కారణమని తెలిపాయి. ప్రస్తుతం శ్రీనివాస్‌ హాంకాంగ్‌కు చెందిన పీసీసీడబ్ల్యూ గ్రూప్‌కు సీఈవోగా ఉన్నారు. అశోక్‌ వేమూరి కూడా జిరాక్స్‌ బీపీఓకి సీఈవోగా కొనసాగుతున్నారు. దీంతో కొత్త సీఈవోగా యూబీ ప్రవీణ్‌ రావునే కొనసాగించనున్నారని సంబంధిత వర్గాలు చాలా బలంగా నొక్కిచెబుతున్నాయి.

English summary
Interim Infosys Chief Executive Officer (CEO) UB Pravin Rao is likely to hold his post,Pravin Rao, who became the CEO temporarily after the then-CEO Vishal Sikka suddenly resigned, is likely to continue being the CEO of the company,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X