వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఇండియాలో ఏ వ్యక్తీ, ప్రాంతం వెనకబడి ఉండొద్దు: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొత్త భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తి గానీ, ప్రాంతం గానీ వెనుకబడి ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవానికి ముందుగా జరిగిన ఎన్‌సీసీ(నేషనల్ క్యాడెట్ కార్ప్స్), ఎన్ఎస్ఎస్(నేషనల్ సర్వీస్ స్కీం) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మనం న్యూ ఇండియా దిశగా పయనిస్తున్నామని, ఈ క్రమంలో ఏ ఒక్క వ్యక్తీ, ప్రాంతం గానీ వెనుకబడి ఉండకూడదని అన్నారు ప్రధాని. గణతంత్ర పరేడ్ ఆలోచన కూడా అదేనని ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లనుద్దేశించి వ్యాఖ్యానించారు. మీరంతా మినీ ఇండియా, న్యూ ఇండియాను చూపించారని.. అదే రియల్ ఇండియా అని అన్నారు.

 pre-Republic Day: Nobody must be left behind in new India, says PM Narendra Modi

'ఒకే ఇండియా'పై మాట్లాడుతూ.. మనదంతా ఒకే జీవన సంప్రదాయం, ఆలోచన అని అన్నారు. తమ విధులను గుర్తించి దేశ ప్రయోజనాల కోసం పాటుపడాలని క్యాడెట్లకు ప్రధాని మోడీ సూచించారు. అలాంటి ఆలోచనలే కొత్త ఇండియాకు బాటలు వేస్తాయన్నారు.

కొత్త ఇండియాలో ఆశయాలు, ఆశలు, కలలు నెరవేర్చుకోవాలని అన్నారు. కాగా, జనవరి 26న భారతదేశం 71వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో కస్టమరీ రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకలకు బ్రెజిలియన్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

కాగా, ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఆర్పీఎఫ్‌కు చెందిన 65 మంది మహిళా బైకర్లు అబ్బురపరిచే విన్యాసాలు చేయనున్నారు. ఇందుకోసం 350సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వాహనాలను వాడనున్నారు. గణతంత్ర వేడుకల్లో మహిళా బైకర్లు పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సమక్షంలో ఇదే మహిళా బృందం విన్యాసాలు చేసింది. 2015లో ఆర్మీ, నేవీ, వైమానిక దళ విభాగాలకు చెందిన మహిళలు పరేడ్‌లో పాల్గొన్నారు. 2018లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన మహిళలు పరేడ్ నిర్వహించారు. అయితే, ఈసారి మాత్రం సీఆర్పీఎఫ్ మహిళలకు అవకాశం దక్కింది.

English summary
No person or region must be left behind in "new India", PM Narendra Modi said Friday in a pre-Republic Day speech where he addressed cadets from the NCC (National Cadet Corps) and NSS (National Service Scheme) in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X