వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IANS-CVoter-ABP exit poll: జార్ఖండ్‌లో హంగ్ అసెంబ్లీనేనా? ఏ పార్టీకి ఎన్నిసీట్లంటే..?

|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పలు మీడియా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ఐయాన్స్-సీ ఓటర్స్-ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. 81 అసెంబ్లీ సీట్లు కలిగిన జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటుు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది.

 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: హింసాత్మకంగా మారిన పోలింగ్..పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: హింసాత్మకంగా మారిన పోలింగ్..పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి

ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అధికార బీజేపీ కూటమికి 28-36 సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ పార్టీ కూటమికి 31-39 నుంచి సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక జేవీఎంపీకి 1-4, ఏజేఎస్‌యూకి 3-7 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేల్చింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 40కి సీట్లు రావాల్సి ఉంది.

predicts IANS-CVoter-ABP exit poll: Jharkhand is headed for a hung assembly

ప్రస్తుతం 40కి పైగా అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి గానీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇతర పార్టీల మద్దతు తీసుకుని కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే సీట్లు ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది.

81 అసెంబ్లీ సీట్లు కలిగిన జార్ఖండ్ రాష్ట్రంలో ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చివరి దశ పోలింగ్ ముగిసింది. ఓటర్ మూడ్, ట్రెండ్స్‌తో పాటు ఇతరత్ర అంశాలను తీసుకుని రాష్ట్రంలో సర్వేలు నిర్వహించారు. జార్ఖండ్ ఎన్నికల్లో ఓటర్ నాడి ఎలాగుందో అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పాటు కానుందో ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది.

మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి నాలుగు దశల్లో 65 స్థానాలకు పోలింగ్ ముగియగా మిగతా 16 స్థానాలకు పోలింగ్ చివరి దశలో జరిగింది. చివరి దశలో హేమా హేమీలు పోటీపడ్డారు. నవంబర్ 30వ తేదీన తొలి దశపోలింగ్ ప్రారంభం అవగా డిసెంబర్ 16వ తేదీన నాల్గవ దశ పోలింగ్ ముగిసింది. ఇక శుక్రవారం ఐదవ దశకు పోలింగ్ జరిగింది.

English summary
predicts IANS-CVoter-ABP exit poll: Jharkhand is headed for a hung assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X