హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'లవ్'కు లాక్ డౌన్ లేదు.. ఇవిగో రిపోర్ట్స్.. దంపతుల్లో పెరిగిన ఆ పిల్స్ వినియోగం..

|
Google Oneindia TeluguNews

కరోనా కారణంగా దాదాపుగా ప్రపంచమంతా ఇళ్లల్లోనే లాక్ అయిపోయింది. చాలామంది ఉద్యోగులకు మునుపెన్నడూ లేనంత ఖాళీ దొరికింది. దీంతో సహజంగానే భార్యాభర్తలకు మరింత సాన్నిహిత్యంగా గడిపే వీలు చిక్కింది. అయితే ఒక్కటే ఆందోళన వారిని వెంటాడుతోంది. అదే అన్-ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ(అనుకోని ప్రెగ్నెన్సీ). లాక్ డౌన్ పీరియడ్‌లో గైనకాలజిస్టులను సంప్రదిస్తున్న దంపతులు,అమ్ముడవుతున్న గర్భ నిరోధక మాత్రలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : తెర పైకి 'బేబీ బూమ్'.. 9 నెలల తర్వాత అదే జరుగబోతుందా..?లాక్ డౌన్ ఎఫెక్ట్ : తెర పైకి 'బేబీ బూమ్'.. 9 నెలల తర్వాత అదే జరుగబోతుందా..?

గర్భ నిరోధక మాత్రల అమ్మకాల్లో పెరుగుదల

గర్భ నిరోధక మాత్రల అమ్మకాల్లో పెరుగుదల

సాధారణ రోజులతో పోలిస్తే లాక్ డౌన్ పీరియడ్‌లో గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు 50శాతం పెరిగినట్టు బెంగళూరుకు చెందిన అపోలో ఫార్మసీ సిబ్బంది చంద్ర తెలిపారు. సాధారణ రోజుల్లో ప్రతీ నెలా 14-15 కాంట్రసెప్టివ్ పిల్స్ (గర్భ నిరోధక మాత్రలు) బాక్సులు అమ్ముడుపోయేవని.. కానీ లాక్ డౌన్ పీరియడ్‌లో ఏప్రిల్ 14 వరకు 25కంటే ఎక్కువ బాక్సులు అమ్ముడుపోయాయని తెలిపారు. అదే సమయంలో సాధారణ రోజుల కంటే మూడు రెట్లు అధికంగా ప్రెగ్నెన్సీ కిట్లు అమ్ముడుపోయినట్టు చెప్పారు.

కమర్షియల్ ఏరియాల్లో పడిపోయిన సేల్స్

కమర్షియల్ ఏరియాల్లో పడిపోయిన సేల్స్

కమర్షియల్ ఏరియాల్లో ఉండే మెడికల్ షాపుల్లో కంటే రెసిడెన్షియల్ ఏరియాలకు దగ్గరగా ఉండే మెడికల్ షాపుల్లో గర్భ నిరోధక మాత్రలు,ప్రెగ్నెన్సీ కిట్ల అమ్మకాలు పెరిగాయి. కమర్షియల్ ఏరియాల్లో గతంతో పోలిస్తే అమ్మకాలు పడిపోయాయి. బెంగళూరులోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో మెడికల్ షాపు నిర్వహించే ఓ యజమాని మాట్లాడుతూ.. సాధారణ రోజుల్లో ప్రతీ నెలా కాంట్రసెప్టివ్ పిల్స్ 20 బాక్సుల వరకు అమ్ముడుపోయేవని చెప్పారు. కానీ లాక్ డౌన్ పీరియడ్‌లో కేవలం ఐదారు బాక్సులు తక్కువ అమ్ముడుపోతున్నట్టు తెలిపారు.

గైనకాలజీ నిపుణులు ఏమంటున్నారు..

గైనకాలజీ నిపుణులు ఏమంటున్నారు..

చాలామంది ఉద్యోగులు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉండటం.. కొంతమంది ఖాళీగానే ఉండటంతో.. దంపతుల్లో అనుకోని ప్రెగ్నెన్సీపై ఆందోళన నెలకొన్నట్టు గైనకాలజీ నిపుణులు చెబుతున్నారు. చాలామంది దంపుతులు తమకు ఫోన్లు చేసి ప్రెగ్నెన్సీ నిరోధానికి సూచనలు అడుగుతున్నట్టు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగానూ అనిశ్చితి నెలకొనడంతో.. ఇలాంటి సమయంలో పిల్లలను కనడానికి వారు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. కండోమ్స్ కంటే గర్భ నిరోధక మాత్రలు,ఇతరత్రా పద్దతుల ద్వారా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే సలహాలు,సూచనల కోసం తమను ఎక్కువగా సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు.

బేబీ బూమ్‌కు ఛాన్స్..?

బేబీ బూమ్‌కు ఛాన్స్..?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు పాక్షిక,సంపూర్ణ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలావరకు పరిశ్రమలు,కంపెనీల సేవలు నిలిచిపోయాయి. కేవలం అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలామంది ఉద్యోగులకు మునుపెన్నడూ లేనంత ఖాళీ సమయం దొరికింది. కరోనా కారణంగా మనిషికి మనిషికి మధ్య సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న వేళ.. ఇంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులకు మాత్రం తమ భార్యలతో మరింత సాన్నిహిత్యంగా మెలిగేందుకు వీలు చిక్కింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా ప్రెగ్నెన్సీ రేటు పెరిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే 9 నెలల తర్వాత 'బేబీ బూమ్' ఏర్పడవచ్చునని.. వచ్చే డిసెంబర్-జనవరి నెలల్లో చాలా దేశాల్లో ఎక్కువ సంఖ్యలో శిశువులు జన్మించే అవకాశం ఉందని చెబుతున్నారు.

English summary
Pregnancy test, pill sales surge by 50% in Bengaluru on lock down period
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X