వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

23 వారాల గర్భవతి కావడంతో.. జామియా విద్యార్థి సఫూరకు షరతులతో కూడిన బెయిల్, ఢిల్లీని వీడి..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ జామియా వర్సిటీలో జరిగిన ఆందోళనలకు సంబంధించి జైలులో ఉన్న జామియా వర్సిటీ విద్యార్థి నేత సఫూర జర్గార్‌కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం సర్గార్ 23 వారాల గర్భవతి.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మానవతా దృక్పదంతో ఆలోచించి అభ్యంతరం తెలుపలేదు. దీంతో హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఢిల్లీ దాటి వెళ్లొద్దు అని సూచించింది.

జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో జర్గార్ ఎంపిల్ చేసతున్నారు. జామియా కో ఆర్డినేషన్ కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో ఢిల్లీలో అల్లర్లు జరగగా.. జర్గార్‌ను ఏప్రిల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద బయటకొచ్చిన జర్గార్.. జమియా వర్సిటీ విద్యార్థి విభాగం నిర్వహించే కార్యకలాపాలకు పాల్గొన్నద్దని హైకోర్టు స్పష్టంచేసింది.

Pregnant Jamia student Safoora Zargar gets bail in Delhi riots case..

కేసు విచారణ అధికారికి కనీసం 15 రోజులకు ఒకసారి ఫోన్‌లో అందుబాటులోఉండాలని తెలిపింది. వ్యక్తిగత పూచీకత్తు రూ.10 వేల విలువైన బాండ్, అంతే మొత్తంలో ష్యూరిటీ కింద కట్టాలని కోరింది. అయితే సోమవారం ఢిల్లీ పోలీసులు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరం తెలిపారు. గర్భవతి అయినంత మాత్రానా.. బెయిల్ ఇవ్వొద్దని కోరారు. కానీ మంగళవారం తుషార్ మొహతా అభ్యంతరం తెలుపకపోవడంతో బెయిల్ వచ్చింది.

English summary
Pregnant Jamia student Safoora Zargar: Delhi High Court has granted bail to pregnant Jamia University student activist Safoora Zargar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X