వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో దారుణం: ఐదు నెలల గర్భిణీపై దాడి చేశారు..ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తోందంటూ ఓ గర్భవతిపై స్థానికులు దాడి చేసిన ఘటన ఈశాన్య ఢిల్లీ హర్ష్‌విహార్‌లో చోటుచేసుకుంది. మూగ చెవుడు ఉన్న బాధితురాలు ప్రియాంకా ఆగష్టు 27న ఓ చిన్నారిని కిడ్నాప్‌ చేసిందంటూ స్థానికులు ఆమెపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు దీపక్, శకుంతల, లలిత్ కుమార్ అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఐదు నెలల గర్భిణీపై స్థానికుల దాడి

ఐదు నెలల గర్భిణీపై స్థానికుల దాడి

కొన్ని నెలల క్రితం చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేవారు తిరుగుతున్నారంటూ అనుమానం వచ్చిన వారిపై స్థానికులు దాడి చేసిన ఘటనలు ఉత్తర్‌ప్రదేశ్‌లో చాలా చూశాం. ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే 20 కేసులు నమోదయ్యాయి. ఇక తాజా ఘటనలో ప్రియాంకా అనే మహిళపై దాడి చేయడం జరిగింది. ఆమె 5 నెలల గర్భిణీ. ప్రియాంకపై స్థానికులు దాడి చేయడంతో గాయపడిన ఆమెను ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

వీడియో వైరల్ అవడంతో వెలుగులోకి అసలు విషయం


గతేడాది తన సోదరి ప్రియాంకకు వివాహం అయ్యిందని ఈ మధ్యనే సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని తుగ్లకాబాద్ నుంచి ఫరీదాబాదుకు ఇల్లు మారిందని సందీప్ కుమార్ తెలిపాడు. ఆమె కనిపించకుండా పోవడంతో ప్రియాంకా తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకురావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఓ పది రోజుల తర్వాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని అందులో ఓ మహిళను కొందరు స్థానికులు దాడి చేయడాన్ని తన స్నేహితుడు గుర్తించి తన దృష్టికి తీసుకురావడంతో అసలు సంగతి వెలుగు చూసిందని చెప్పాడు సందీప్. ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో ప్రియాంకను గుర్తించి తమకు అప్పగించారని చెప్పాడు.

ప్రియాంకపై 5 నుంచి 10 మంది వ్యక్తులు దాడి

ప్రియాంకపై 5 నుంచి 10 మంది వ్యక్తులు దాడి

ఇక వీడియోలో ప్రియాంకపై ఓ 5 నుంచి 10 మంది దాడి చేస్తున్నట్లు ఉంది. అంతేకాదు పిల్లలను కిడ్నాప్ చేస్తావా అంటూ స్థానికులు ప్రశ్నించడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు ఆమె తలపై దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా చిన్నపిల్లలకు డబ్బులు ఆశ చూపించి అనంతరం వారిని కిడ్నాప్ చేస్తుందని స్థానికులు ఆరోపించారు. తను నిరపరాధినని తనకేమి తెలియదని ప్రియాంకా వేడుకోవడం కనిపించింది. హర్ష్ విహార్‌లో దాడికి సంబంధించి సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. అక్కడ బాధితురాలు ఉందని చెప్పారు. అయితే విచారణలో ఆమెపై స్థానికులు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే మహిళను షెల్టర్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

వీడియోలో కనిపిస్తున్న ఇతరులను కూడా వెంటనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఆగష్టు 17న ప్రియాంకా తన ఇంటి నుంచి తప్పిపోయిందని పోలీసులు తెలిపారు. అదే రోజున ఆమె అదృశ్యమైనట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని వెల్లడించారు.

English summary
A 25-year-old pregnant woman was allegedly beaten up by a mob in North East Delhi’s Harsh Vihar on suspicion of kidnapping a child on August 27. Police said the victim, Priyanka, who is hearing and speech impaired, was beaten up by a group of around 10 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X