వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైవేపై ఢీకొన్న కారు-అంబులెన్స్: నిండు గర్భిణి మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నిండు గర్భిణి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో సోమవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై రాంపూర్‌కు సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ కారు గర్భిణీతో వెళుతున్న అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కడుపులోని శిశువుతో పాటు గర్భిణి మృతి చెందగా, నర్సుతో పాటు మరో మగ్గురు వ్యక్తుల తీవ్రంగా గాయపడ్డారు.

Pregnant woman dies in car-ambulance collision

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుయుడైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గంగానదిలో పడి ఇద్దరు సోదరులు మృతి

గంగానదిలో పడి ఇద్దరు సోదరులు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోపీ గంజ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమన్ సింగ్, అవధు సింగ్ అనే ఇద్దరు సోదరులు గంగానది జగీరాబాద్ ఘాట్‌లో స్నానం చేయడానికి వెళ్లారు.

ప్రమాదవశాత్తూ జారి నదిలో పడిపోయారు. ఈత రాకపోవడంతో ఇద్దరు సోదరులు ఊపిరాడక మృతి చెందారు. దీనిని గుర్తించిన స్ధానికులు మృతదేహాలను బయటకు తీశారు.

పాక్‌లో భారీ వర్షం: 45 మంది మృతి

పాకిస్థాన్‌లో ఆదివారనం నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి 45మంది మృత్యువాతపడ్డారు. కైబర్‌-పఖ్‌తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు, భవనాలు కూలిపోయాయి. వర్షం కారణంగా ఒక్క పెషావర్‌లోనే 25 మంది మృతిచెందారు.

సుమారు 200 మందికి గాయాలయ్యాయి. పెషావర్‌ విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేశారు.

English summary
A pregnant woman died here after the ambulance in which she was being taken to the hospital for delivery collided with a speeding car, police said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X