• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సహించలేరని ప్రీతిజింతా: నెస్ ఇచ్చిన 9 పేర్లు ఇవే!

By Srinivas
|

ముంబై: ప్రీతిజింతా చేసిన లైంగిక ఆరోపణలను కొట్టిపారేస్తూ ఆమె మాజీ ప్రియుడు, ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియా ముంబై మెరైన్ డైవ్ పోలీసులకు తొమ్మిది పేర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో లాల్, లోరెట్టా జోసెప్, పూజా దడ్లాని, అన్నెలైన్ ఆడమ్స్, ఫరాహ్ ఊమర్‌బో, స్వీటీ బర్మాన్, కమలేష్ షా, రయాన్ ముస్తఫా, శరత్ నాథ్‌లు ఉన్నట్లుగా పేర్కొన్నారని సమాచారం.

నెస్ వాడియా బుధవారం పోలీసులకు లేఖ రాశారు. ప్రీతిజింతా ఆరోపణలన్నీ అబద్ధాలని ఆయన ఆ లేఖలో అన్నారు. ఈ ఏడాది మే 30వ తేదీన వాంఖడే స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమ వద్ద ఉన్న వ్యక్తుల పేర్లను ఇస్తున్నానని, వారు స్వేచ్ఛగా నిజాలను వెల్లడించగరలని నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు.

ప్రీతిజింతా ఆరోపణలపై గత నెల ఆయన రెండు లైన్ల పత్రికా ప్రకటన మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత ఇంత వివరంగా పోలీసులకు లేఖ రాయడం ఇదే మొదటిసారి. వాడియాపై ప్రీతి జింతా జూన్ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Preity Zinta Molestation: Ness Wadia Offers Nine Witnesses!

తన వైపు నుంచి సాక్షుల పేర్లను ప్రీతిజింతా ఇది వరకే పోలీసులకు ఇచ్చారు. వారిలో అరడజను మంది వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. గత వారం జింతా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. కాగా, నెస్ వాడియాను మరో 48 గంటలలో ప్రశ్నించే అవకాశముది.

మరోవైపు, తానెందుకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చిందో, కేసు ఎందుకు పెట్టిందో సవివరంగా తన ఫేస్‌బుక్‌లో ప్రీతిజింతా తెలిపిన విషయం తెలిసిందే.

"నా సాక్ష్యాన్ని స్ట్రెయిట్‌గా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. పోలీసుల చేత నేనెందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించాను? ఎందుకంటే కొన్నేళ్ల బెదిరింపుల తర్వాత నాకు మరో అవకాశం లేదు. శారీరక హింస లేదా దురుసు ప్రవర్తన పురుషుడు లేక స్త్రీ, సెలబ్రిటీ లేదా ఎవరైనా సహించలేరు! అయితే, ఇందులో నా తప్పేంటంటే స్త్రీను కావడమే. ఈ సమయంలో నాకు చాలా ప్రియమైన వ్యక్తి నన్ను బెదిరించి, అవమానించి, దూషించాడు" అని ప్రీతీ వివరించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 Serieka Lal, Loretta Joseph, Pooja Dadlani, Anneline Adams, Farah Oomerbhoy, Sweetie Burman, Kamlesh Shah, Rayaan Mustapha and Sharath Nath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more