వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 ఏళ్ల క్రితం చేశా: మ్యాగీపై ప్రీతిజింతా, తెలంగాణలోను నిషేధం దిశగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మ్యాగీ నూడుల్స్ వ్యవహారం పైన ప్రముఖ బాలీవుడ్ నటి, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింతా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎప్పుడో తాను చేసిన అడ్వర్టైజ్‌మెంట్‌కు ఇప్పుడు కేసు వేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ.. తాను నెస్లేకు 12 ఏళ్ల కిందట ఎండోర్స్ చేశానని చెప్పారు. ఆమె ఇందుకు సంబంధించి రెండు ట్వీట్లు చేశారు.

Preity Zinta

వివరాలు సేకరిస్తున్నాం: కేంద్రమంత్రి పాశ్వాన్

మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో తాము వివరాలు సేకరిస్తున్నామని కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. బాధ్యుల పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలోని సూపర్ మార్కెట్లలో మ్యాగీ అమ్మకాల పైన నిషేధం విధించినట్లు చెప్పారు. కాగా, మ్యాగీ ఉదంతం నేపథ్యంలో నెస్లే మార్కెట్ భారీగా పతనమైంది.

తెలంగాణలోను నిషేధం దిశగా..

తెలంగాణలోను మ్యాగీ పైన నిషేధం ఉండబోతుందా అంటే అవుననే అంటున్నారు. లెడ్ శాతం ఎక్కువగా ఉంటే నిషేధిస్తామని మంత్రి లక్ష్మా రెడ్డి చెప్పారు. పరీక్షల కోసం వాటిని ల్యాబ్‌కు పంపిస్తామని చెప్పారు.

హెచ్చార్సీలో ఫిర్యాదు

మ్యాగీ నూడుల్స్ పైన హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్ స్వీకరించిన హెచ్చార్సీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

English summary
Actress Preity Zinta, one of the three Bollywood celebrities involved in the fallout from the Maggi noodles controversy, has put out a perplexed tweet pointing out that she endorsed the Nestle product 12 years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X