వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుఎస్‌లో సెటిల్ కాను, వాటా అమ్మను: జింతా

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ఐపియల్ ఫ్రాంచైజ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో తన వాటాను అమ్మే ప్రసక్తి లేదని బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్పష్టం చేశారు. నెస్ వాడియాతో తలెత్తిన వివాదం విషయంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. మీడియాలో ఊహాగానాలకు ఆశ్చర్యపోయానని ఆమె బుధవారం రాత్రి చెప్పింది.

తాను ఫ్రాంచైజ్‌లో వాటా అమ్మడం లేదని, అమెరికాలో స్థిరపడాలనుకోవడం లేదని ప్రీతీ జింతా చెప్పారు. భారత్‌లో చాలా ఐఎంపి అంశాలున్నాయని, అవి వార్తలకు అవసరమైవని ఆమె అన్నారు. నెస్ వాడియా, ప్రీతి జింతా మధ్య తలెత్తిన వివాదం అత్యంత దారుణంగా మారింది.

Preity Zinta says she won't settle in US

జింతాను వేధిస్తున్నారంటూ గ్యాంగ్‌స్టర్ రవి పుజారి హెచ్చరికలు చేశారని వాడియా పారిశ్రామిక గ్రూప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పారిశ్రామికవేత్త నుస్లీ వాడియా కార్యాలయం ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌తో వాడియాకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు నుస్లీ వాడియా అందుబాటులోకి రాలేదు. ఆయన దేశంలో లేరని సమాధానం వచ్చింది.

English summary
Actress Preity Zinta on Wednesday night ruled out selling her stake in IPL franchise Kings XI Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X