వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే దేశం ఒకే ఎన్నికలు, బీజేపీ మంత్రం, ప్రధాని మోడీ, అమిత్ షా మాస్టర్ ప్లాన్, కాంగ్రెస్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

One Nation-One Election : BJP Prepare For Polls

న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల నినాదంతో లోక్ సభ, అన్ని రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దం కావడానికి బీజేపీ నాయకులు ఢిల్లీలో సమావేశం అయ్యి సుధీర్ఘంగా చర్చించారు.

ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ

భారతదేశంలోని ఒక్కోరాష్ట్రంలో ఒక్కొసారి ఎన్నికలు జరుగుతున్నాయని ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసన సభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని గుర్తు చేశారు.

కేంద్రం నిధులు

కేంద్రం నిధులు

పలు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని, ఆ సమయంలో ఆ రాష్ట్రాల్లో కేంద్రం అభివృద్ది పథకాలు అమలు చెయ్యడం సాధ్యం కావడంలేదని బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 లోక్ సభ, శాసన సభ

లోక్ సభ, శాసన సభ


లోక్ సభ, శాసన సభ ఎన్నికలు ఒకే సారి జరిగితే ఎన్నికల నియమావళి అందరికీ అమలులో ఉంటుందని, అలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, కేంద్రంలోని అభివృద్ది పథకాలు అమలు చెయ్యడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రాలకు కేంద్రం అండ

రాష్ట్రాలకు కేంద్రం అండ

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి జరిగితే కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎక్కువ సహకారం, సంబంధాలు ఏర్పాడుతాయని, అలా జరిగితే దేశంలో అభివృద్ది పథకాలు అన్ని సక్రమంగా అమలు అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 సిద్దంగా ఉండండి

సిద్దంగా ఉండండి

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లోక్ సభతో పాటు శాసన సభ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సూచించారని తెలిసింది. లోక్ సభ ఎన్నికలతో పాటు, శాసన సభ ఎన్నికలు ఒకే సారి జరిగితే బీజేపీకి ఎక్కువ లాభం ఉంటుందని అంచనా వేశారని సమాచారం.

ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు

ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలు

ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నవీస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సహ బీజేపీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

English summary
BJP's national leaders including PM Narendra Modi, and BJP national president Amit Shah hosted a meeting of all BJP's chief ministers and deputy chief ministers to find ways to deliver on its promise of “one nation, one election”. The meeting held in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X