• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

యువత అవసరాలు, ఆకాంక్షలను నేరవేర్చడంలో ఎన్‌ఈపీ 2020 దోహదపడుతుంది: రాష్ట్రపతి

|

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలు ఆయా రాష్ట్ర గవర్నర్ల సదస్సులో ప్రసంగించనున్నారు. రోల్‌ ఆఫ్ ఎన్ఈపీ -2020 ఇన్ ట్రాన్స్‌ఫార్మింగ్ హైయర్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నేతృత్వంలో జరుగనుంది. దాదాపు 34 ఏళ్ల తర్వాత విద్యావిధానంలో సంస్కరణలు తీసుకొస్తూ కొత్త విధానం రూపొందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1986లో విద్యావిధానం రూపొందించడం జరిగింది. ఇక నూతన విద్యా విధానం 2020లో భారీ సంస్కరణలు చేపట్టారు. ఇక గవర్నర్ల కాన్ఫరెన్స్‌లో రాష్ట్రపతి ప్రధాని ప్రసంగం లైవ్ అప్‌డేట్స్ మీకోసం

President and PM Modi to adress on National Education policy-2020 live Updates

Newest First Oldest First
11:42 AM, 7 Sep
అన్ని రంగాలలో నాణ్యమైన విద్యా పరిశోధనలను ప్రేరేపించడానికి జాతీయ పరిశోధన ఫౌండేషన్ ఏర్పాటు చేయబడుతుంది. పరిశోధన సంస్కృతిని బలోపేతం చేయడానికి, అన్ని విశ్వవిద్యాలయాలు మరియు ఉన్నత విద్యాసంస్థలు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయాలి : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
11:40 AM, 7 Sep
సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం మరియు ఏకీకరణతో, మెరుగైన ఫలితాలను ఇచ్చే అభ్యాస ప్రక్రియ వేగవంతం అవుతుంది, దీని కోసం, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం (NETF) స్థాపించబడుతుంది: రామ్‌నాథ్ కోవింద్
11:39 AM, 7 Sep
భారతీయ భాషలు, కళ మరియు సంస్కృతికి NEP2020 లో ప్రాధాన్యత ఇవ్వబడింది, ఇది విద్యార్థులలో సృజనాత్మక సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది, భారతీయ భాషలను బలోపేతం చేస్తుంది మరియు భారత ఐక్యతను కాపాడుతుంది: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
11:22 AM, 7 Sep
విదేశీ విధానాలు, రక్షణ పరమైన విధానాలు దేశానికి ఎలా అయితే సంబంధించిన విషయాలు అవుతాయో, అలానే విద్యా విధానం కూడా అవుతుంది. ఇవి ప్రభుత్వానికి సంబంధించినవి కావు.. దేశానికి సంబంధించినవి: ప్రధాని మోడీ
11:14 AM, 7 Sep
భారతదేశంలోని యువకుల అవసరాలు మరియు ఆకాంక్షలను నెరవేర్చడానికి NEP2020 సహాయపడుతుంది: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
11:13 AM, 7 Sep
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతోంది: ప్రధాని మోడీ
11:12 AM, 7 Sep
కొత్త విద్యావిధానంతో ప్రాక్టికల్స్‌కు, ఇష్టానికి, ప్రదర్శనకు పెద్ద పీటం వేశాం: ప్రధాని మోడీ
11:11 AM, 7 Sep
కొత్త నూతన విద్యా విధానం సామాజిక మరియు ఆర్థిక జీవితాలకు కొత్త మార్గనిర్దేశకాలను సూచిస్తుంది: ప్రధాని మోడీ
11:10 AM, 7 Sep
True knowledge liberates minds. With the new NEP 2020, youth can study subjects as per their interest: PM Read more at: https://www.oneindia.com/india/nep-2020-live-modi-president-to-address-governors-conference-on-new-education-policy-at-10-30-am-3145233.html
కొత్త ఎన్ఈపీ 2020తో విద్యార్థులకు నచ్చిన సబ్జెక్ట్ ను తీసుకుంటారు: ప్రధాని మోడీ
10:57 AM, 7 Sep
నూతన జాతీయ విద్యావిధానంతో కొత్త బూస్టింగ్ లభిస్తుంది:ప్రధాని మోడీ
10:56 AM, 7 Sep
జాతీయ విద్యావిధానం కోసం దాదాపు 2లక్షల మంది నుంచి అభిప్రాయాలను సేకరించాం . దాదాపు 4 నుంచి 5 ఏళ్లు ఈ విధానం రూపొందిచేందుకు సమయం పట్టింది: ప్రధాని మోడీ
10:54 AM, 7 Sep
ఇక్కడికి చేరివచ్చిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ కార్యక్రమం ఎంతో ముఖ్యమైనది: ప్రధాని మోడీ
10:51 AM, 7 Sep
కొత్త జాతీయ విద్యావిధానంతో 2020 50శాతం జీఈఆర్‌ను 2035 నాటికి సాధించగలుగుతాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్
10:36 AM, 7 Sep
మరికాసేపట్లో జాతీయ విద్యా విధానం 2020పై గవర్నర్ల సదస్సులో ప్రసంగించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ

English summary
President Ram Nath Kovind and Prime Minister Narendra Modi will address the inaugural session of the Governors’ Conference on National Education Policy through video conference today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X