President election: బెంగళూరులో యశ్వంత్ సిన్హా, మాజీ సీఎం సిద్దూ, కేపీసీసీ చీఫ్ ఢుమ్మా, ఏం జరిగింది ? !
బెంగళూరు/ హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వంలోని మిత్రపక్షాలు తప్పా దేశంలోని ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రయత్నిస్తున్నారు.
శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేర్ రావ్ ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ లో అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీల నాయకులను కలిసిన యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రతిపక్ష నాయకులకు మనవి చేశారు.

హైదరాబాద్ లో పలు పార్టీల నాయకులను కలిసిన యశ్వంత్ సిన్హా ప్రత్యేక విమానంలో బయలుదేరి బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకున్న యశ్వత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు స్వాగతం పలికారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి యశ్వంత్ సిన్హా నేరుగా హోటల్ సాంగ్రియాకు చేరుకున్నారు.
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే, అయితే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కానీ, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కానీ స్వాగతం పలకడానికి రాలేదు. ఆదివారం హోటల్ సాంగ్రియాలో సిద్దరామయ్య ఆధ్వరయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో యశ్వంత్ సిన్హా బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు