
NDA రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు?
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) రాష్ట్రపతి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో భారతీయ జనతాపార్టీ పెద్దలు అభ్యర్థి ఎంపికపై కసరత్తులు ముమ్మరం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంకయ్యనాయుడితో ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. వీరిమధ్య దాదాపు గంటసేపు సమావేశం జరిగింది.

హడావిడిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన వెంకయ్యనాయుడు
ప్రపంచ
యోగా
దినోత్సవాన్ని
పురస్కరించుకొని
సికింద్రాబాద్
లో
నిర్వహించిన
యోగా
కార్యక్రమంలో
పాల్గొన్న
వెంకయ్యనాయుడు
తన
కార్యక్రమం
ముగిసిన
వెంటనే
హడావిడిగా
ఢిల్లీకి
పయనమవడంతో
ఎన్డీయే
అభ్యర్థి
వెంకయ్యనాయుడేనంటూ
వార్తలు
వచ్చాయి.
కేంద్ర
మంత్రులు
కూడా
ఆయనతో
సమావేశమవడంతో
ఈ
వార్తలకు
బలం
చేకూరింది.
రాష్ట్రపతి
అభ్యర్థిని
నిర్ణయించేందుకు
భారతీయ
జనతాపార్టీ
పార్లమెంటరీ
పార్టీ
ఈ
రోజు
సాయంత్రంభేటీ
కానున్న
తరుణంలో
వెంకయ్యతో
చర్చించడం
ప్రాధాన్యతను
సంతరించుకుంది.

ఈరోజు సాయంత్రం కీలకభేటీ
ప్రధానమంత్రి
నరేంద్రమోడీ
అధ్యక్షతన
పార్టీ
పార్లమెంటరీ
బోర్డు
సమావేశం
జరగనుంది.
కేంద్ర
మంత్రులు,
ముగ్గురు
ప్రధాన
కార్యదర్శులతోపాటు
14
మంది
ఇతర
నేతలతో
బీజేపీ
ఇప్పటికే
ఒక
కమిటీని
ఏర్పాటు
చేసిన
సంగతి
తెలిసిందే.
ఈ
కమిటీతో
జేపీ
నడ్డా
ఆదివారం
సమావేశం
నిర్వహించారు.
రాష్ట్రపతి
ఎన్నికల్లో
ఎన్డీయే
తరఫున
పలువురి
పేర్లు
ప్రధానంగా
వినపడుతున్నాయి.
అందులో
ఉపరాష్ట్రపతి
వెంకయ్యనాయుడి
పేరు
కూడా
ఉంది.

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి
అభ్యర్థిత్వంపై
ప్రతిపక్షాలు
కూడా
ఈరోజే
సమావేశం
కాబోతున్నాయి.
ఎన్సీపీ
అధినేత
శరద్
పవార్
అధ్యక్షతన
జరిగే
ఈ
భేటీలో
కేంద్ర
మాజీ
మంత్రి
యశ్వంత్
సిన్హాను
ఉమ్మడి
అభ్యర్థిగా
ప్రకటించే
అవకాశాలు
కనపడుతున్నాయి.
పోటీచేసేందుకు
సిన్హా
కూడా
సముఖత
వ్యక్తం
చేశారు.
తృణమూల్
కాంగ్రెస్
లో
ఉన్న
ఆయన
తన
పార్టీ
సభ్యత్వానికి
రాజీనామా
చేశారు.

చత్తీస్ ఘడ్ గవర్నర్ ఉయికీ కూడా అవకాశం?
మరోవైపు
చత్తీస్
ఘడ్
గవర్నర్
అనసూయియా
ఉయికీ
కూడా
రాష్ట్రపతి
పదవికి
ఎన్డీయే
తరఫున
రేసులో
ఉన్నట్లు
సమాచారం.
ఒకవేళ
ఆమెను
రాష్ట్రపతి
అభ్యర్థిగా
ప్రకటిస్తే,
వెంకయ్యనాయుడును
ఉపరాష్ట్రపతిగా
కొనసాగించే
అవకాశాలున్నాయి.
లేదంటే
వెంకయ్యను
రాష్ట్రపతిగా
ప్రకటిస్తే
అనసూయియా
ఉయిని
ఉప
రాష్ట్రపతిని
చేసే
అవకాశం
కనపడుతోంది.
ఈరోజు
సాయంత్రానికి
ఈ
విషయమై
ఒక
స్పష్టత
రానుంది.