వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైట్లీ భౌతికకాయానికి రాష్ట్రపతి కోవింద్ అంజలి, ఆదివారం అంత్యక్రియలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఆయన పార్థీవదేహాన్ని కైలాస్ కాలనీలోని ఇంటికి తరలించారు. రేపు నిగమ్‌బోద్ ఘాట్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టంచేశారు. అంతకుముందు బీజేపీ ప్రధాన కార్యాలయంలో జైట్లీ పార్థీవదేహం ఉంచుతామని తెలిపారు.

<strong>తెరముందు నరేంద్ర మోడీ.. తెరవెనుక ఇద్దరు ఉద్దండులు, మేధస్సు, ప్రజాధారణ కలిగిన నేతలు. </strong>తెరముందు నరేంద్ర మోడీ.. తెరవెనుక ఇద్దరు ఉద్దండులు, మేధస్సు, ప్రజాధారణ కలిగిన నేతలు.

జైట్లీ గతేడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. అప్పటినుంచి అస్వస్థతతోనే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. అరుణ్ జైట్లీ మృతి తనను తీవ్ర దిగ్బాంతికి గురిచేసిందన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.

President Kovind, Amit Shah reach home to pay tributes

ఈ మేరకు జైట్లీ పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు కూడా అరుణ్ జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. జైట్లీ మృతిపై బీజేపీ అగ్రనేత అద్వానీ విచారం వ్యక్తం చేశారు. గడ్డుకాలంలో బీజేపీ ఎదుర్కొన్న సున్నితమైన అంశాలకు తన తెలివి, మేధస్సుతో జైట్లీ చెక్ పెట్టాడని పేర్కొన్నారు. అంతేకాదు దేశం ఒక గొప్ప పార్లమెంటరీయన్‌ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

English summary
President Ram Nath Kovind has reached Arun Jaitley's home to pay tributes. BJP president Amit Shah and other senior party leaders too have reached Arun Jaitley's Kailash Colony home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X