వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాష్ట్రపతి అమోదం.. అక్టోబర్ 31 నుండి అధికారిక యూటీలు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జమ్ము కశ్మీర్ విభజన బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. బిల్లు ఆమోదం తర్వాత గెజిట్ విడుదల అయింది. రాష్టపతి గెజిట్ అధికారికంగా జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అధికారికంగా కొనసాగనున్నాయి.అయితే గెజిట్ ప్రకారం ఆక్టోబర్ 31 నుండి అధికారికంగా పరిపాలన కొనసాగనుంది. అప్పటి వరకు గవర్నర్ పరిపాలన క్రిందనే రెండు ప్రాంతాల పరిపాలన కొనసాగనుంది.జమ్ము కశ్మీర్

యూటీపై అధికారిక ముద్ర

సోమవారం రాజ్యసభలో జమ్ము కశ్మీర్‌ను విడదీస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లు ప్రవేశపెట్టి అదే రోజు పాస్ చేయించున్నారు. కాగ మంగళవారం లోక్‌సభలో బిల్లుపై చర్చించిన తర్వాత విభజన బిల్లు పాస్ అయింది.అనంతరం బిల్లును రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం కోసం పంపారు.ఈ నేపథ్యంలో విభజన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అనంతరం న్యాయశాఖ గెజిట్‌ను విడుద చేశారు.

President Kovind gives assent to J&K Reorganisation Bill,

28 రాష్ట్రాలు, 9 యూటీలు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం కాగా, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగనున్నాయి. దీంతో దేశంలో మొత్తం మొత్తం 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా ఒక రాష్ట్రం తగ్గి 28 రాష్ట్రాలకు చేరింది.కాగా ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతల వలే జమ్ము కశ్మీర్‌కు అసెంబ్లీతో కూడిన యూనియన్ టెర్రిటరీగా ఏర్పాటు చేశారు. లద్దాక్ మాత్రం శాశ్వత కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. దీంతో మొత్తం మూడు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా ఆరు ప్రాంతాలు పూర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో పాలన కొనసాగనుంది.

అసెంబ్లీతో కూడిన యూటీలు

కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రాష్ట్రాల తరహాలో ఇక్కడ అసెంబ్లీలు ఉండవు. అయితే గతంలో ఉన్న ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచ్ఛేరిల్లో అసెంబ్లీలు ఉన్నాయి. దీంతో ఆయా యూనియన్ టెరిటరీల్లో అధికారులు కేంద్రం, స్థానిక ప్రభుత్వం మధ్య విభజింపబడి ఉంటాయి. అయితే నిర్ణయాల్లో మాత్రం కేంద్రానిదే పై చేయిగా ఉంటుంది. ప్రస్తుతం అసెంబ్లీ లేని యూనియన్ టెరిటరీల్లో చంఢీఘడ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ సరసన లడాఖ్, శాసనసభ కలిగిన దేశ రాజధాని ఢిల్లీ, పుదిచ్చేరి సరసన జమ్మూ కాశ్మీర్ చేరింది.

English summary
President Kovind gives assent to J&K Reorganisation Bill,Jammu and Kashmir Reorganisation Bill, 2019 was passed by the Parliament, The two new UTs will come into existence from October 31,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X