వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25, 26తేదీల్లో స్పీక‌ర్ల స‌ద‌స్సు -రాష్ట్రపతి ప్రారంభోపన్యాసం -ముగింపునాడు మోదీ స్పీచ్

|
Google Oneindia TeluguNews

భారత రాజ్యాంగ దినోత్సవం(నవంబర్ 26) 71వ వార్షికోత్సవం సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు స్పీకర్ల కాన్ఫరెన్స్ జరుగనుంది. 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ గా పిలుస్తోన్న ఈ సమావేశాలకు గుజ‌రాత్ రాష్ట్రం న‌ర్మ‌దా జిల్లాలోని కెవాడియా ప‌ట్ట‌ణం వేదిక కానుంది.

'సర్జికల్ స్ట్రైక్’‌పై కేంద్రం అనూహ్యం -ఏం జరిగిందో తెలీదన్న హోం మంత్రి కిషన్ రెడ్డి'సర్జికల్ స్ట్రైక్’‌పై కేంద్రం అనూహ్యం -ఏం జరిగిందో తెలీదన్న హోం మంత్రి కిషన్ రెడ్డి

న‌వంబ‌ర్ 25, 26 తేదీల్లో రెండు రోజుల‌పాటు జ‌రుగ‌నున్న ఈ స‌ద‌స్సును భారత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించ‌నున్నారు. ఈ మేర‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా మంగళవారం ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని రెండు రోజుల కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తుట్లు ఆయన తెలిపారు.

President Kovind, PM Modi to address 80th All India Presiding Officers Conference

లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌తోపాటు దేశంలోని వివిధ చ‌ట్ట‌స‌భ‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ల(స్పీకర్లు లేదా చైర్మన్ల) మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించే ఉద్దేశంతో 1921 నుంచి ఈ స్పీక‌ర్ల స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవ‌ల్ల మ‌ధ్య‌లో కొన్ని కాన్ఫ‌రెన్స్‌లు జ‌రుగ‌లేదు. బుధవారం ప్రారంభం కానున్నది 80వ సమావేశం. హార్మోనియ‌స్ కోఆర్డినేష‌న్ బిట్వీన్ లెజిస్లేచ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడీషియ‌రీ-కీ టు ఎ వైబ్రాంట్ డెమోక్ర‌సీ అనే థీమ్‌పై ఈ ఏడాది సమావేశాలు నిర్వహిస్తున్నారు.

నివర్ బీభత్సం: ఇసుక బస్తాలతో అణు కేంద్రానికి రక్షణ - తీర జిల్లాల్లో 144 సెక్షన్ -ఇదీ తాజా సీన్ నివర్ బీభత్సం: ఇసుక బస్తాలతో అణు కేంద్రానికి రక్షణ - తీర జిల్లాల్లో 144 సెక్షన్ -ఇదీ తాజా సీన్

Recommended Video

Credit Guarantee Support for 26 Stressed Sectors రూ.2.05 లక్షల కోట్లు మంజూరు| #AtmaNirbharBharat3

స్పీకర్ల భేటీకి ప్రధానంగా లోక్ సభ స్పీక‌ర్ ఓంబిర్లా, రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు, గుజ‌రాత్, రాజ‌స్థాన్ రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌లు, గుజ‌రాత్ సీఎం విజ‌య్‌రూపానీ, లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌధురి, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషి, వివిధ రాష్ట్రాల శాస‌న‌స‌భ‌లు, శాస‌న‌మండ‌ళ్ల స్పీక‌ర్లు, చైర్మన్లు హాజ‌రుకానున్నారు. స‌ద‌స్సు చివ‌రి రోజైన న‌వంబ‌ర్ 26న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స‌మావేశానికి హాజ‌రై తుది ప్ర‌సంగం చేయ‌నున్నారు.

English summary
President Ram Nath Kovind will inaugurate the 80th All India Presiding Officers Conference. The two-day conference at Kevadia in Gujarat begins Wednesday. Prime Minister Narendra Modi will address the concluding session of Conference on Thursday via video conferencing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X