వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజాజీ మార్గ్‌కు ప్రణబ్ పార్థీవ దేహం... నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

|
Google Oneindia TeluguNews

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థీవదేహం ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన నివాసంకు చేరుకుంది. అక్కడకు ముందుగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకుని ప్రణబ్‌ ముఖర్జీకి నివాళులు అర్పించారు. ప్రణబ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజ్‌నాథ్ తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రణబ్ నివాసంకు చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అంతకుముందు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్‌లు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించారు.

Recommended Video

#PranabMukherjee: Watch PM Modi,Politicians Pay Floral Tribute | Oneindia Telugu

ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా నివాళులు అర్పించారు ప్రధాని మోడీ. ఉదయం 10 గంటలకు ప్రణబ్ నివాసంకు చేరుకున్న ప్రధాని మోడీ... నివాళులు అర్పించారు. అనంతరం ప్రణబ్ కుమార్తె శర్మిష్ట, కుమారుడు అభిజీత్ ముఖర్జీలతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రణబ్ మరణ వార్త వినగానే దాదాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. నివాళులు అర్పించిన వెంటనే ప్రధాని వెనుదిరిగారు.

ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించి వెళ్లాక భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించారు. ప్రణబ్ ముఖర్జీ వ్యక్తిత్వాన్ని దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వెంకయ్యనాయుడు తెలుగులో ట్వీట్ చేశారు. ఇక చివరిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రణబ్ నివాసంకు చేరుకుని పార్థీవదేహంకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి కాసేపు మాట్లాడారు.

 President, PM and few other prominent personalities pay last respects to former President Pranab

ఇదిలా ఉంటే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను రక్షణ శాఖ చేస్తోంది. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తోంది. మధ్యాహ్నం నుంచి ప్రణబ్ అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక ప్రణబ్ ముఖర్జీ మృతి చెందడంతో దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే వారంరోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది.

English summary
President Ramnath Kovind, Vice President Venkaiah Naidu, Speaker Om Birla and PM Modi paid their last respects to the former President Pranab Mukherjee who passed away yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X