వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాత్మాగాంధీ వర్ధంతి... ఘన నివాళి అర్పించిన రాష్ట్రపతి కోవింద్,ప్రధాని మోదీ...

|
Google Oneindia TeluguNews

జాతిపిత మహాత్మాగాంధీ 73వ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. సమాధిపై పుష్ప గుచ్చాలను ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంతా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్,త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ పాల్గొన్నారు.

ప్రతీ ఏటా మహాత్మాగాంధీ వర్దంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'బాపూజీకి నివాళులు. ఆయన ఆలోచన విధానం నిరంతరం స్పూర్తి రగిలిస్తూనే ఉంటుంది. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుందాం.' అని పేర్కొన్నారు.

President, PM Modi pay tributes to Mahatma Gandhi on his death anniversary

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ట్విట్టర్‌ ద్వారా గాంధీకి నివాళులు అర్పించారు. 'యావత్ భారతావని తరుపున జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ప్రవచించిన సత్యం,అహింసా,శాంతి,నిరాడంబరత,స్వచ్చత,వినయం అనే ఆదర్శాలకు మనం కట్టుబడి ఉండాలి.' అని పేర్కొన్నారు.

కాగా,మహాత్మా గాంధీ జనవరి 30,1948న సాయంత్రం 5.17గంటలకు ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ఆయన హత్యకు గురైన సంగతి తెలిసిందే. నాధురాం గాడ్సే చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. గాంధీ ముందుకు వచ్చిన గాడ్సే మొదట రెండు చేతులతో వినయంగా నమస్కరించి... ఆ తర్వాత పిస్టల్‌తో కాల్చి చంపాడు. మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో కుప్పకూలిన గాంధీ అక్కడికక్కడే కన్నుమూశారు. ఒక బుల్లెట్ ఆయన ఛాతిలోకి దూసుకెళ్లగా... మరో రెండు బుల్లెట్లు ఆయన పొట్టలోకి దూసుకెళ్లాయి. చివరి క్షణాల్లో గాంధీజీ హే రామ్ అన్నారని కొంతమంది చెబుతుంటారు... అయితే అలాంటి పదమేదీ ఆయన పలకలేదని గాడ్సే వెల్లడించాడు.

English summary
President Ram Nath Kovind and Prime Minister Narendra Modi on Saturday paid tribute to the father of the nation, Mahatma Gandhi, on his 73rd death anniversary. Gandhi was shot dead on this day in 1948 by Nathuram Godse. His death anniversary is observed as Martyrs' Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X