వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోని ధనికులు దాతృత్వాన్ని చాటాలి: రాష్ట్రపతి రామ్‌నాథ్

దేశంలోని ధనికులు భారతదేశ పురాతన సంస్కృతి అయిన దాతృత్వాన్ని పునరుజ్జీవింపజేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోరారు. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని ధనికులు భారతదేశ పురాతన సంస్కృతి అయిన దాతృత్వాన్ని పునరుజ్జీవింపజేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోరారు. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారి ప్రసంగించిన రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రూపకర్తలు దూరదృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారని వారిని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు.

president

నిరుపేదలను ఆదుకోవడానికి ధనికులు ముందుకు రావాలన్నారు. అందరికీ ఇళ్లు, దారిద్య్రాన్ని తరిమికొట్టడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వైపు వేగంగా అడుగులేయాలన్నారు.

విద్యారంగంలో సంస్కరణలు అత్యావశ్యకమన్న రాష్ట్రపతి.. 21వ శాతాబ్దానికి అనుగుణంగా డిజిటల్ ఎకానమీ, జినోమిక్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి తదితర మార్పులకు విద్యావిధానంలో చోటివ్వాలన్నారు. పౌరులే జాతి నిర్మాతలని రాష్ట్రపతి పేర్కొన్నారు.

English summary
President Ram Nath Kovind on Thursday asked the rich to renew India's age-old culture of philanthropy by voluntarily giving up their entitlements for those with greater need. In his first Republic Day eve address to the nation, the President also spoke of the need to move ahead rapidly on sustainable development goals like housing for all and the obligation to eliminate the curse of poverty in the shortest possible time. Kovind utilized the opportunity to stress on the need to reform, upgrade and enlarge the education system to make it relevant to 21st Century realities of the digital economy, genomics, robotics and automation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X