వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభలో ఒక నామినేట్ పోస్టును భర్తీ చేసేందుకు ఈ మేరకు నిర్ణయించిన నేపథ్యంలో కేంద్రం నోటికేషన్ జారీ చేసింది.

President Ram Nath Kovind Nominates Ex-CJI Ranjan Gogoi To Rajya Sabha

గత సంవత్సరం నవంబర్ 17న రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి పదవీ విరమణ పొందారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య కేసులో ఆయన కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

President Ram Nath Kovind Nominates Ex-CJI Ranjan Gogoi To Rajya Sabha

జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 18, 1954లో జన్మించారు. ఆయన న్యాయవాద వృత్తి స్వీకరించి బార్ అసోసియేషన్ లో 1978లోనమోదు అయ్యారు. ఆయన గౌహతీ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తూ ఫిబ్రవరి 28, 2001 న న్యాయమూర్తి అయ్యారు. ఆయన సెప్టెంబర్ 2010 న పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ కాబడ్డారు. తరువాత ఫిబ్రవరి 12, 2011 న ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.

Recommended Video

MP Political Crisis: Speaker adjourns House without floor test | బలపరీక్ష ను అడ్డుకున్న కరోనా వైరస్

రంజన్ గొగోయ్ ఏప్రిల్ 23, 2012 న సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవిని స్వీకరించారు. ఆయన తండ్రి "కేశబ్ చంద్ర గొగోయ్" అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి వ్యక్తి ఆయనే కావడం గమనార్హం.

English summary
In a massive development, President Ram Nath Kovind on Monday has nominated former Chief Justice of India Ranjan Gogoi to the Rajya Sabha, according to a notification issued by the Centre. Under clause (1) of Article 80 of the Constitution, the President has nominated the former CJI to fill the vacancy in the Upper house due to the retirement of one of the nominated member.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X