వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురు వెంట రాగా, ఆర్మీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

|
Google Oneindia TeluguNews

భారత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం కోవిడ్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆర్ఆర్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న తొలి డోసు టీకాను వేయించుకున్నారు. దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియలో భాంగా 60 ఏళ్లు దాటిన వారితోపాటు వివిధ వ్యాధులతో బాధపడుతోన్న 45ఏళ్లు దాటిన వ్యక్తులందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తుండటం తెలిసిందే.

viral video:బీజేపీ మంత్రి సెక్స్ వీడియో -కర్ణాటకలో పెను సంచలనం -ఉద్యోగం పేరుతో మహిళను..

కూతురు స్వాతి కోవింద్ తో కలిసి ఆర్మీ ఆస్పత్రికి వచ్చిన రాష్ట్రపతికి అక్కడి నర్సులు టీకాను అందించారు. ఈ సందర్భంగా దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియను కోవింద్ శ్లాఘించారు. ''ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగస్వాములైన వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు. దేశప్రజలంతా వ్యాక్సిన్ పొందాలని కోరుతున్నా'' అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

President Ram Nath Kovind receives first dose of Covid-19 vaccine in Delhi

ప్రెసిడెంట్ కంటే ముందే ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలు సీఎంలు, మంత్రులు కూడా టీకాలు వేయించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల‌నుకునేవారు.. తొలుత కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,56,20,749 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. ఇదిలా ఉంటే,

సహజీవనంలో సెక్స్.. రేప్ కాబోదు -తప్పుడు వివాహ వాగ్ధానం నేరమే -సుప్రీంకోర్టు మరో సంచలనంసహజీవనంలో సెక్స్.. రేప్ కాబోదు -తప్పుడు వివాహ వాగ్ధానం నేరమే -సుప్రీంకోర్టు మరో సంచలనం

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం నాటి బులిటెన్ లో కొత్త కేసుల సంఖ్య 12వేలలోపు ఉండగా, కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం 24 గంటల్లో కొత్తగా 14,989 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కు, రికవరీల సంఖ్య 1,08,12,044కు, మరణాల సంఖ్య 1,57,346కు పెరిగాయి. ప్రస్తుతం 1,70,126 యాక్టివ్ కేసులున్నాయి.

English summary
President Ram Nath Kovind on Wednesday took the first jab of coronavirus vaccine at RR Hospital in the national capital, two days after India commenced its second phase of the vaccination drive to inoculate people above 60 years and those over 45 with comorbidities against Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X