వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయ్‌కు 93 ఏళ్ళు: ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పిన మోడీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయికి నేడు 93వ ఏట అడుగు పెడుతున్నారు. ఆయన భారతదేశాన్ని న్యూ మిల్లీనియంలోకి సమర్థవంతంగా నడిపించారని అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఓ పదవీ కాలం పూర్తిగా ప్రధాన మంత్రిగా కొనసాగిన మొదటి కాంగ్రెసేతర నేతగా ఆయన రికార్డు సృష్టించారు. వాజ్‌పేయ్ మంచి వక్త. బీజేపీలో దిగ్గజ నేత. ఆయన ప్రత్యర్థులు కూడా ఆయనను వ్యక్తిగతంగా అభిమానిస్తారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. వాజ్‌పేయి పార్లమెంటులో తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునేవారు.

President Ram Nath Kovind, VP Venkaiah Naidu, PM Narendra Modi greet Vajpayee on 93rd birthday

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత లోకప్రియ నేత, గౌరవనీయ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడ ట్వీట్ చేశారు. మా ప్రియమైన అటల్‌జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అసాధారణ, దార్శనిక నాయకత్వం భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా చేసిందన్నారు. అనంతరం మోడీ వాజ్‌పేయ్ ఇంటికి వెళ్ళి మరీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
President Ram Nath Kovind, Vice President M. Venkaiah Naidu and Prime Minister Narendra Modi on Monday greeted former Prime Minister Atal Bihari Vajpayee on his 93rd birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X